
ప్రోత్సాహకం లేక పరిమళించని అనంతపురం పూల సాగు
వర్షాభావ పరిస్థితులతో, గిట్టుబాటు ధర లేక, రవాణా ఖర్చులు అధికం కావడంతో మల్లెపూల సాగు తగ్గుముఖం పడుతోంది.
గుత్తి : ఒకప్పుడు 300 ఎకరాల సాగుతో అబ్బేదోడ్డి గ్రామ రైతులు జిల్లాలో పూల సాగులో ఆదర్శంగా నిలిచారు. అంతే ఆదాయంతో గ్రామానికి మల్లె, కనకాంబరం సాగు కనక వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ పంట రైతులకు భారమైంది.
కూలీల కొరత, వర్షాభావం, మార్కెటింగ్ సదుపాయం, అధ్వన్నంగా రోడ్లు తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. ఫలితంగా సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గిపోయింది. గ్రామంలో సుమారు 300 కుటుంబాలు పూలసాగు తో జీవనోపాధి పొందుతున్నారు. ఒక్కో రైతు 30 సెంట్ల నుంచి ఎకరం వరకు మల్లెపూల సాగు చేస్తున్నారు. రాను రాను వర్షాభావ పరిస్థితులతో, గిట్టుబాటు ధర లేక, రవాణా ఖర్చులు అధికం కావడంతో మల్లెపూల సాగు తగ్గుముఖం పడుతోంది.
పూల పెంపకం అనేది అలంకార ఉద్యానవన శాస్త్రంలోని ఒక విభాగం, ఇది పుష్పాలు, అలంకార మొక్కలను పెంచడం, అమ్మడం , అమర్చడం వంటి వాటితో వ్యవహరిస్తుంది. సమశీతోష్ణ వాతావరణాల్లో మొక్కల పెంపకం వ్యవస్థల్లో పువ్వులు, కుండీలలో ఉంచే మొక్కలను ఎక్కువగా పెంచుతారు కాబట్టి, కొన్ని పువ్వులను నర్సరీలు లేదా పంట పొలాలలో ఆరుబయట పండిస్తారు.
పూల పెంపకం అంటే పడకల మొక్కల పెంపకం, గ్రీన్‌హౌస్‌లలో పెంచడానికి లేదా ఇంటి లోపల మొక్కలుగా ఉపయోగించడానికి కోతలను ఉత్పత్తి చేయడం రెండూ ఉంటాయి. పూల సాగు ఎల్లపుడు లాభదాయకమే. ప్రస్తుతం, పండగలు, పెళ్లిళ్లతో పూల రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది.
పూలలో కనకాంబరాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కనకాంబరాలకు మార్కెట్లో మంచి ధర లభిస్తుండడంతో ఇటీవలకాలంలో రైతులు వీటిని సాగు చేసేందుకు ఆశక్తి చూపుతున్నారు. కనకాంబరాలు ఉష్ణమండల వాతావరణానానికి అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా వాతావరణంలో వచ్చే హెచ్చుతగ్గులను కూడా కనకాంబరాలు తట్టుకొని నిలబడగలవు. కనకాంబరాలు సాగును తక్కువ విస్తీరణంలో కూడా చేపట్టవచ్చు, కాబట్టి చిన్న , సన్నకారు రైతులు కూడా కనకాంబరాలను సులభంగా సాగు చెయ్యవచ్చు. వీటిని సాగు చేసే రైతులు కూడా మార్కెట్లో మంచి ధర లభించడంతో మంచి లాభాలు పొందుతున్నారు.
కనకాంబరాలు సాగు చేపట్టే రైతులు అన్ని యాజమాన్య పద్దతులను పాటిస్తే దాదాపు మూడేళ్లపాటు నికర ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుంది. మొక్కలు సాగు చేపట్టే ముందు రైతులు నీటి ఎద్దడిని తట్టుకునే బహువార్షిక రకాలను ఎంచుకోవాలి, అంతేకాకుండా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే రకాలు ఎంచుకోవాలి. గుత్తి మండలంలో అబ్బేదోడ్డి, అణగనదొడ్డి, న్యమతాబాద్, పెద్దొడ్డి కనకాంబరాల సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడి ప్రాంతాల్లో అధిక తేమ, వాతావరణ పరిస్థితులు వాతావరణం సాగుకు అనుకూలిస్తాయి. ఇక్కడి మట్టిలోని నీటి నిల్వలు నేల రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. కనకాంబరాలు ప్రధాన పంటగా మాత్రమే కాకుండా కొబ్బరి, పామాయిల్, జామ, దానిమ్మ, నారింజ వంటి తోటల్లో అంతర పంటగా కనకాంబరం సాగు చేపట్టి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. మేలైన యాజమాన్య పద్దతులను పాటిస్తే మొక్కలు నాటిన మూడు నెలల్లోనే దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. పూత ప్రారంభమైన తరువాత సంవత్సరం పొడవునా పూలు పూస్తాయి, జూన్ నుండి జనవరి వరకు పూతకు అనుకూలంగా ఉంటుంది, ఈ సమయంలో దిగుబడి కూడా ఎక్కువుగా ఉంటుంది. కనకాంబరం మొగ్గలు పువ్వులుగా విచ్చుకోవడానికి రెండు రోజుల సమయం పడుతుంది.
ఉదయం , సాయంత్రం వేళలు పూలు కోసేందుకు అనుకూలంగా ఉంటాయి. ఈ విధంగా ఏడాదికి 1800 నుండి 2500 కిలోల వరకు దిగుబడి పొందవచ్చు, మార్కెట్ సదుపాయం లేక రిటైల్ మార్కెట్, తోపుడు బండ్లు, చిన్న వర్తకులు ఎక్కువ సరకు కొనలేకపోవడం, పెద్ద నగరాల్లో ఉన్న ఫ్లవర్ మార్కెట్ కు అనుసంధానం కాకపోవడం సమస్యగా మారింది.
ప్రస్తుతం మార్కెట్లో కనకాంబరాలు ఒక కిలో ధర 200- 400 రూపాయిల వరకు పలుకుతుంది. అబ్బేదోడ్డిలో ఎక్కువగా పండించే పంటలలో మల్లె కూడా ఒకటి. గుండు మల్లెను ఎక్కువ విస్తీర్ణంలోను, జాజిమల్లె, సనను తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. గుండుమల్లె, జాజిమల్లి సువాసనలను వెదజల్లుతాయి. ఈ పూలలో బెంజైల్ ఎసిఫేట్, బెంజైల్ బెంజోయేట్, యూజినాల్, టెర్పనాల్, బెంజాల్డిహైడ్, ఇండోల్ కాంపౌండ్స్, జాస్మిన్, మిథైల్ జాస్మొనేట్ ఉన్నందున పూలకు సువాసనను సంతరించుకున్నాయి. గుండుమల్లె మార్చి నుంచి సెప్టెంబర్ వరకు, జాజిమల్లె మార్చి నుంచి నవంబర్ వరకు పూల దిగుబడినిస్తాయి.
మల్లె పూలు, కనకాంబరాలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు రుణాలు అందించి మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎన్నో ఏళ్లుగా పూలసాగునే నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఇక్కడ ఒక్క కోల్డ్ స్టోరేజ్ యూనిట్ లేకపోవడం శోచనీయం, మార్కెట్ సదుపాయాలు కల్పించి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. ప్రభుత్వం పూల రైతులకు సబ్సిడీతో రుణాలు ఇచ్చి ఆదుకోవాలి.
అనేక సంవత్సరాలుగా పూల తోటలు సాగుచేసి ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు. ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసి పూల రైతులను ఆదుకోవాలని ప్రజాసైన్స్ వేదిక అధ్యక్షులు డా. ముచ్చుకోట. సురేష్ బాబు, పౌరస్పందన వేదిక రాష్ట్ర నాయకులు ప్రొ. జీ. వెంకటశివారెడ్డి రైతు కూలీ సంఘం నాయకులు బాయినేని నాగేంద్ర ప్రసాద్, అంబటి రామకృష్ణ తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.