హర్యానాలో బీజేపీ విజయం మహారాష్ట్ర ఎన్నికలపై ప్రభావం చూపుతుందా?
x

హర్యానాలో బీజేపీ విజయం మహారాష్ట్ర ఎన్నికలపై ప్రభావం చూపుతుందా?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం మహారాష్ట్రలో జరిగే ఎన్నికలపై ప్రభావం చూపుతుందా? అనే చర్చ జరుగుతోంది.


హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం మహారాష్ట్రలో జరిగే ఎన్నికలపై ప్రభావం చూపుతుందా? అనే చర్చ జరుగుతోంది. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్‌పీ) కూటమి - మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) మొత్తం 48 స్థానాల్లో 30 స్థానాలను కైవసం చేసుకుని అధికార మహాయుతి కూటమికి గట్టి పోటీ ఇచ్చింది. ఇటు హర్యానాలో 10 లోక్‌సభ స్థానాలకుగాను 5 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర, హర్యానా లోక్‌సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం పరాజయం పాలైంది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో పార్టీల ఓటమికి కారణాలు భిన్నంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఈ సారి ఎన్నికలలో మూడో ఫ్రంట్?

హర్యానాలో ఎన్నికల పోరు కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగింది. కాని మహారాష్ట్రలో అలా కాదు. రెండు కూటములు - MVA, మహాయుతి మధ్య పోటీ ఉండబోతుంది. ప్రతి కూటమిలో మూడు రాజకీయ పార్టీలుంటాయి. ఈ రెండు కూటములకు తోడు ఈ సారి మహారాష్ట్ర ఎన్నికలలో రాజ్ థాకరే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS), ప్రకాష్ అంబేద్కర్ వంచిత్ బహుజన్ అఘాడి (VBA) స్వతంత్రంగా పోటీ చేయాలనుకుంటున్నాయి. అంటే మూడో ఫ్రంట్ కూడా సిద్ధమవుతోందన్న మాట. ఈ ఎత్తుగడ బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకేనని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

సీట్ల సర్దుబాటుపై చర్చలుంటాయా?

హర్యానాలో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో మహారాష్ట్రలో సీట్ల భాగస్వామ్యపై చర్చలు జరిగే అవకాశం ఉంది. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే 13 సీట్లు గెలుచుకుంది. అత్యధిక సీట్లు గెలుపొందిన పార్టీ కావడంతో ఈ సారి హస్తం పార్టీ ఎక్కువ స్థానాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శివసేన (యుబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఇలా అన్నారు. “గమనించవలసిన విషయం ఏమిటంటే గెలవడానికి సారవంతమైన నేల ఉంది. ప్రత్యక్ష పోటీలో ఎందుకు ఓడిపోయామన్న విషయాన్ని వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మహారాష్ట్రలో సీట్ల పంపకాల చర్చలు జరుగుతున్నాయి. అన్ని కోణాల్లో పంపకాలపై చర్చలుంటాయి” అని పేర్కొన్నారు.

చర్చల్లో జాప్యం వల్లే ఓడిపోయారా?

లోక్‌సభ ఎన్నికల్లో లాగా మహారాష్ట్రలో సుదీర్ఘ చర్చల కారణంగా బీజేపీ అనుకున్నని స్థానాల్లో గెలవలేకపోయింది. దాంతో మహాయుతి మిత్రపక్షాలు - ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపితో వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటుపై నిర్ణయానికి రావాలని కాషాయ పార్టీ యోచిస్తోంది. ఒక్కో పార్టీ తమ సిట్టింగ్‌ నియోజకవర్గాలను నిలబెట్టుకోవాలని, అంటే 105 సీట్లు, శివసేన (షిండే)కి 40, ఎన్‌సీపీ (అజిత్‌ పవార్‌)కి 41 సీట్లు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో మొత్తం 288 సీట్లలో 102 సీట్లు ఇంకా ఖరారు కాలేదు. ఎన్‌సీపీ 85-90 సీట్ల కావాలని ఒత్తిడి చేస్తుందని చెబుతుండగా, బీజేపీ కనీసం 155 నుండి 160 సీట్ల కోసం ఒత్తిడి చేస్తుందని సమాచారం. ఎందుకంటే ముంబై, థానే, కొంకణ్‌లలో మొదటి రెండు ప్రాంతాలలో వరుసగా 36, 24 నియోజకవర్గాలను డిమాండ్ చేస్తూ సేన తమను తాము నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.

కులాలను జతకట్టి..

హర్యానాలో బీజేపీ విజయానికి కుల సమీకరణాలూ ఒక కారణం. మహారాష్ట్రలో మరాఠా, ముస్లిం, దళితుల ఓట్లను ఏకం చేయడంలో కాంగ్రెస్ కీలకమైన భాగస్వామ్యమైన మహా వికాస్ అఘాడి (MVA)కి పట్టుంది. హర్యానాలో జాట్‌లు 25 శాతం, దళితులు 20 శాతం ఉన్నారు. మహారాష్ట్రలో మరాఠాలు 30 శాతం, దళితులు 12 శాతం, ముస్లింలు 11 శాతం ఉన్నారు. అయితే హర్యానాలా కాకుండా మహారాష్ట్ర కుల రాజకీయాలు భిన్నంగా ఉన్నాయి.

మనోజ్ జరంగే అభ్యర్థులను పోటీకి దింపుతారా?

OBC కేటగిరీ కింద మరాఠా కమ్యూనిటీకి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమకారుడు మనోజ్ జరంగే-పాటిల్ గత నెలలో నిరవధిక నిరాహార దీక్ష చేయడంతో మరాఠా రిజర్వేషన్ అంశం చర్చనీయాంశమైంది. తమ డిమాండ్లను మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 48 గంటల్లో అసెంబ్లీ ఎన్నికలకు తన వ్యూహాన్ని వెల్లడిస్తానని జరాంగే ఇటీవల ప్రకటించారు. తన మద్దతుదారులు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తారని చెప్పారు. అలాగే ప్రస్తుతం OBC-NT కేటగిరీలో ఉన్న ధన్‌గర్ కమ్యూనిటీ కూడా షెడ్యూల్డ్ తెగ (ST) హోదా డిమాండ్ చేస్తోంది.

వార్థికా ఆదాయం పెంపు దేనికి సంకేతం?

2014, 2019తో పోలిస్తే..ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని నాలుగు ST సీట్లలో ఒకదాన్ని మాత్రమే మహాయుతి దక్కించుకుంది. ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన కొన్ని ఎత్తుగడలను ఇది వివరిస్తుంది. 'నాన్ క్రీమి లేయర్'గా అర్హత సాధించేందుకు వార్షిక ఆదాయ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం ఈ వారం కేంద్రానికి సిఫార్సు చేసింది.

మహారాష్ట్ర రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్‌కు రాజ్యాంగ హోదా ప్రకారం ముసాయిదా ఆర్డినెన్స్‌ను క్లియర్ చేయడం మరో కీలకమైన క్యాబినెట్ నిర్ణయం. ఈ నిర్ణయాలు ఎన్నికలకు ముందు షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల సమూహాలకు మహాయుతి కూటమి ప్రాధాన్యాలుగా చెప్పుకోవాలి.

వ్యవసాయ సంక్షోభం..

హర్యానాలో మాదిరిగానే మహారాష్ట్ర వ్యవసాయ రంగంలో సమస్యలున్నాయి. రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి ఓడిపోవడానికి ప్రధాన కారణం వ్యవసాయ సంక్షోభం. మహారాష్ట్రలో 80% కంటే ఎక్కువ భూముల్లో పత్తి, సోయాబీన్‌ను పండిస్తారు. రైతు సంఘాల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని 65 లక్షల మంది పత్తి, సోయాబీన్ రైతులకు హెక్టారుకు రూ. 5,000 (2 హెక్టార్ల వరకు) బదిలీ చేస్తామని, MSP, మార్కెట్ ధర మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలని మహాయుతి ప్రభుత్వం గత నెలలో నిర్ణయం తీసుకుంది. సోయా-పత్తి రైతులకు సబ్సిడీ కింద రూ.2,399 కోట్లు పంపిణీ చేస్తామని, 49.5 లక్షల మంది ఖాతాదారుల ఖాతాల్లో జమ చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 96 లక్షల మంది ఖాతాదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని రాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే వెల్లడించారు.

అంతేకాకుండా ఉల్లిపాయలపై ఎగుమతి సుంకాన్ని సడలించడం, సోయా ధరలపై సానుకూల చర్యలు తీసుకోవడం లాంటివి బిజెపికి, రాష్ట్రంలోని దాని కూటమి భాగస్వాములకు సహాయపడవచ్చు. ఎన్నికలకు ముందు ఈ ఎత్తుగడలు మహా వికాస్ అఘాడి కూటమికి సవాలుగా మారవచ్చు.

అయితే ప్రభుత్వం ఇప్పుడు రైతుల ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించే సవాలును ఎదుర్కొంటోంది. ఇతర అంశాలతో పాటు ముఖ్యంగా విదర్భ, మరఠ్వాడా ప్రాంతాలలో ఓటింగ్ సరళిని ఈ ధరలు ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Read More
Next Story