ఏపీ, ఒడిషా సీఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ
x

ఏపీ, ఒడిషా సీఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ

ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయిన మోదీ..మధ్యాహ్నం ఒడిషా చేరుకుంటారు. అక్కడ సీఎంగా బీజేపీ ఎమ్మెల్యే మోహన్ చరణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేశారు. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. విజయవాడ శివారులోని మేధా ఐటీ పార్కు సమీపంలో బుధవారం ఉదయం 11.27 గంటలకు జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా సహా పలువురు మంత్రులు కూడా విచ్చేశారు. తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై , పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీజేఐ మాజీ ఎన్వీ రమణ, సినీనటులు చిరంజీవి, రజినీకాంత్ హాజరైన వారిలో ఉన్నారు. చంద్రబాబు తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్, తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. ఆ పార్టీకి మూడు కేబినెట్‌ బెర్త్‌లు, బీజేపీకి నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వనున్నారు. మిగిలిన పోస్టులను టీడీపీ ఎమ్మెల్యేలతో భర్తీ చేయనున్నారు.

175 మంది సభ్యులున్న ఏపీ అసెంబ్లీ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 26 మంది మంత్రులు ఉండవచ్చు. ఇప్పటికి మంత్రుల జాబితాను చంద్రబాబు గవర్నర్‌కు పంపారు.

2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకుగాను 135 స్థానాలను టీడీపీ, జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాలను గెలుచుకున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నాయుడు నేతృత్వంలోని టీడీపీ గద్దె దించింది. ఈ సారి ఎన్నికలలో వైసీసీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. గత ఎన్నికలలో 151 స్థానాలు దక్కించుకుంది.

సాయంత్రం ఒడిషాకు ప్రధాని..

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన తర్వాత సాయంత్రం మోహన్‌ చరణ్‌ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని ఒడిషాకు తరలివెళ్తారు.

ఒడిశా తొలి బీజేపీ సీఎంగా మోహన్ చరణ్ మాఝీ..

ఒడిశా తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ కొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా..

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాఝీ గిరిజన హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా పేరుతెచ్చుకున్నారు. బీజేపీ చీఫ్ విప్‌గా ఉన్న సమయంలో గిరిజనుల సమస్యలపై గొంతెత్తారు.

ఒడిశా ఉప ముఖ్యమంత్రులుగా కనక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవతి పరిదా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ప్రధాని మోదీ మధ్యాహ్నం 12.45 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరుతారు. 2.30 గంటలకు రాష్ట్ర రాజధానికి చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు చేరుకుంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఉన్నత స్థాయి ప్రముఖులతో పాటు ఆహ్వానం పంపిన మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

ఓటమిపాలైన పట్నాయక్..

ఒడిశాను ఐదు సార్లు పాలించిన నవీన్ పట్నాయక్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మొత్తం 147 అసెంబ్లీ స్థానాల్లో 78 స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకుంది. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో జరిగే మాఝీ ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు 30,000 మంది హాజరవుతారని అంచనా.

Read More
Next Story