బాలాసాహెబ్‌ను రాహుల్ ప్రశంసించగలడా? కాంగ్రెస్‌కు మోదీ సూటి ప్రశ్న
మహారాష్ట్ర ఎన్నికల సందర్భగా ప్రధాని మోదీ తొలుత చంద్రాపూర్, ఆపై పూణేలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భగా ఆయన తొలుత చంద్రాపూర్, ఆపై పూణేలో పర్యటించారు. అక్కడ సర్ పరశురాంభౌ కళాశాల (ఎస్పీ కళాశాల) మైదానంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఆరేడు దశాబ్దాలు దేశాన్ని పాలించినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని దేశం మొత్తం ఎందుకు అమలు చేయలేదని అడగాలనుకుంటున్నాను. జమ్మూ, కాశ్మీర్‌లో భిన్నమైన రాజ్యాంగం ఉంది. భారతదేశం అక్కడ పని చేయలేదు. కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం దీనిని మార్చింది. ఒకప్పుడు లాల్ చౌక్‌లో (శ్రీనగర్‌లో) తొక్కిన త్రివర్ణ పతాకం.. నేడు అదే చౌక్‌లో త్రివర్ణ పతాకం ఎగురుతోంది." అని చెప్పారు.
మహారాష్ట్ర సంస్కృతిని కాపాడేందుకు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ఎలా పనిచేస్తుందో కూడా ప్రధాని మోదీ హైలైట్ చేశారు. మహావికాస్ అఘాడి ఔరంగజేబును ప్రశంసించడం ద్వారా ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను అగౌరవపరిచారని, వీర్ సావర్కర్, బాలాసాహెబ్ ఠాక్రేల కృషిని గుర్తించడంలో విఫలమయ్యారని విమర్శించారు. మహావికాస్ అఘాడీకి దమ్ము ఉంటే వారి 'యువరాజ్' బాలాసాహెబ్‌ను ప్రశంసించమని చెప్పండి అంటూ పరోక్షంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీనుద్దేశించి అన్నారు.
“అధికారం కోసం కాంగ్రెస్ విభజన రాజకీయాలకు పాల్పడింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ దళితులు, ఆదివాసీలు, ఓబీసీలను విభజించాలని చూస్తోంది. ఎస్టీలు, ఎస్సీ, ఓబీసీల ఉపకులాలను ఒకదానికొకటి ఇరకాటంలో పెట్టి వారిని బలహీనపర్చాలని చూస్తోంది. నిదానంగా రిజర్వేషన్లు లాగేసుకుంటారు. మనమంతా ఐక్యంగా ఉండాల్సిన సమయం ఇది ‘ఏక్ హై, తోహ్ సేఫ్ హై’ అని అన్నారు.