ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌కు బెయిల్ పొడిగించారా?
x

ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌కు బెయిల్ పొడిగించారా?

కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొడిగింపు పిటిషన్‌పై వెకేషన్ బెంచ్ ఎలా స్పందించింది? అసలు ఎందుకు బెయిల్ పొడిగించాలని ఢిల్లీ సీఎం కోరుతున్నారు?


తన మధ్యంతర బెయిల్‌ను మరోవారం పొడిగించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఆరోగ్యం బాగోలేనందున కొన్నివైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని తన పిటీషన్‌లో పేర్కొన్నారు. అయితే బెయిల్ పొడిగింపు నిర్ణయాన్ని CJI DY చంద్రచూడ్ మాత్రమే తీసుకోగలరని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ పేర్కొంది.

జోక్యం చేసుకోలేం..

కేజ్రీవాల్ అకస్మాత్తుగా బరువు తగ్గడం, శరీరంలో కీటోన్ లెవల్స్ పెరగడంతో మరిన్ని వైద్య పరీక్షలు చేయించేందుకు మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింగ్వి కోరారు.

జస్టిస్‌లు జేకే మహేశ్వరి, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ బెయిల్ పొడిగింపుపై నిర్ణయం తీసుకోలేమని చెప్పారు.

ముఖ్యమంత్రికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ప్రధాన బెంచ్‌లోని న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా గత వారం కోర్టులో ఉన్నపుడు.. కేజ్రీవాల్‌ విజ్ఞప్తిని ఎందుకు ప్రస్తావించలేదని న్యాయమూర్తులు సింఘ్వీని ప్రశ్నించారు.

మద్యం కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. లోక్‌సభ ఎన్నికలలో ప్రచారం కోసం మే 10న సుప్రీం కోర్టు ఆయనకు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికలు జూన్ 1తో ముగుస్తాయి. ఆ తర్వాత రోజు (జూన్ 2న ) కేజ్రీవాల్ లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.

Read More
Next Story