తిరుపతి జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం.!
x

తిరుపతి జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం.!



శ్రీకాళహస్తి డివిజన్ లో కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి గంజాయిని విక్రయిస్తుండమే కాకుండా పక్కరాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తిరుపతి జిల్లాఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. శ్రీకాళహస్తి నుంచి మూడు రాష్ట్రాలకు ముఠా గంజాయిని సరఫరా చేస్తున్న 17మందిని అరెస్ట్ చేసి 32కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గంజాయి విక్రయంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. అరెస్టు అయిన నిందితుల నుంచి నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.



Read More
Next Story