మరాఠ్వాడాలో MVAని మహాయుతి ఎలా తిప్పి కొట్టింది?
x

మరాఠ్వాడాలో MVAని మహాయుతి ఎలా తిప్పి కొట్టింది?

మరాఠాలు, ధన్‌గర్లు, ఇతర వర్గాలకు కోటాను విస్తరించడానికి 50% రిజర్వేషన్ పరిమితిని తొలగిస్తామని కాంగ్రెస్ హామీ కూడా ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.


లోక్‌సభ ఎన్నికల సమయంలో మరాఠ్వాడాలో మరాఠాలకు రిజర్వేషన్ల కల్పించే తెరపైకి వచ్చింది. ఆ సమయంలో మహాయుతి కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే అసెంబ్లీ ఎన్నికలలో కూటమి అభ్యర్థులు ఆ ప్రాంతంలో మొదటి రౌండ్ నుంచే ఆధిక్యత కొనసాగడం విశేషం.

మరాఠ్వాడా ప్రాంతంలోని 46 అసెంబ్లీ స్థానాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు 34 స్థానాల్లో ఆధిక్యంలో ముందున్నారు. ఇది 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు పూర్తి విరుద్ధంగా ఉంది.

మరాఠా OBC రిజర్వేషన్ల అంశం మరాఠ్వాడా ప్రాంతంలో BJP, దాని కూటమి భాగస్వాముల అభ్యర్థులకు తక్కువ సీట్లు వస్తాయని భావించారు. అయితే అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. దీంతో చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జరంగే-పాటిల్ 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో అధికార మహాయుతి కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం ఆయన మాటలను మరాఠా సామాజిక వర్గం నమ్మినట్లు లేదు.

ఈ ప్రాంతంలోని ముస్లింలు, మరాఠాలు, దళితు మద్దతు కూడుగట్టుకోవాలని MVA తీవ్రంగానే ప్రయత్నించింది. మరాఠాలు, ధన్‌గర్లు, ఇతర వర్గాలకు కోటాను విస్తరించడానికి 50% రిజర్వేషన్ పరిమితిని తొలగిస్తామని కాంగ్రెస్ హామీ కూడా ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. మరాఠాలను తమ వైపు తిప్పుకునే వ్యుహాంలో భాగంగా మాలి, ధన్‌గర్, వంజరి వర్గాలకు చెందిన OBCలను దగ్గరకు చేర్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా మరఠ్వాడాలో వరుస ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్, ఇండియా కూటమి విభజన రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో జారంగే నిలబెట్టిన అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగిలి, అధికార మహాయుతి కూటమి విజయావకాశాలను పెంచడంలో సహాయపడ్డారు. కొన్ని అసెంబ్లీ స్థానాల్లో మరాఠా అనుకూల కోటా మద్దతుదారులను పోటీకి దింపుతానని ప్రకటించింది మహాయుతి కూటమి. దీంతో కొన్ని గంటల తర్వాత జారేంజ్ ఎన్నికల అరేనా నుంచి వెనక్కి తగ్గారు. 14 సెగ్మెంట్లలో మాత్రమే తన అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం.

Read More
Next Story