Jharkhand Politics | హేమంత్ సోరెన్ ఒంటరి ప్రమాణం వెనక ఆంతర్యమేంటి?
x

Jharkhand Politics | హేమంత్ సోరెన్ ఒంటరి ప్రమాణం వెనక ఆంతర్యమేంటి?

ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాత్ర తగ్గడంతో 2029 సార్వత్రిక ఎన్నికల సమయానికి కూటమిలో సోరెన్ కీలక సభ్యుడయ్యే అవకాశం ఉంది.


జార్ఖండ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ఆధిక్యత చాటింది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలనుగాను 34 సీట్లను గెలుచుకుంది. ఇక బీజేపీ 21 స్థానాలు, కాంగ్రెస్ 16, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) 4, సీపీఐ (ఎంఎల్) 2 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్‌తో గవర్నర్ సంతోష్ గంగ్వార్ నవంబరు 28న రాంచీలో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నీతూ వ్యాస్ హోస్ట్‌గా వ్యవహరించే ‘‘ ది ఫెడరల్ క్యాపిటల్ బీట్’’ డిబేట్‌లో ప్రముఖ పాత్రికేయులు మనోజ్ ప్రసాద్, అనుపమ్ శశాంక్, రాజకీయ వ్యాఖ్యాత సుమన్ శ్రీవాస్తవ తమ ఓపీనియన్స్ షేర్ చేసుకున్నారు. హేమంత్ సోరెన్ ఒంటరిగా ప్రమాణ స్వీకారం చేయడం జార్ఖండ్ రాజకీయాల్లో కొత్త శకాన్ని సూచిస్తుందన్నారు.

సోరెన్ జాతీయ పాత్ర పోషిస్తారా?

2029 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యే సమయానికి.. ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాత్ర తగ్గడంతో కూటమిలో సోరెన్ కీలక సభ్యుడయ్యే అవకాశం ఉంది. ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఆయన భార్య కల్పనా సోరెన్ కూటమిలో జేఎంఎం తరపున ప్రధాన భూమికగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ముందున్న ఆర్థిక సవాళ్లు..

ముఖ్యమంత్రి సహాయత యోజన పథకం కింద మహిళలకు నెలవారీ సాయాన్ని రూ.1,000 నుంచి రూ.2,500లకు పెంచారు. ఈ హామీ అమలు చేయడం సోరెన్ ప్రభుత్వానికి కాస్త కష్టమే. ఈ పథకం ద్వారా 57 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని, రాష్ట్రానికి ఏటా రూ. 6వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. అయితే ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్నాయి. మరోవైపు 21 సీట్లు సాధించిన బీజేపీ ఆర్థిక నిర్వహణ, పాలనలోపాలను లక్ష్యంగా చేసుకుని సోరెన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉందన్నారు.

జేఎంఎంలో ప్రధాన భాగస్వామి కాంగ్రెస్‌కు ఆర్థిక, పట్టణాభివృద్ధి శాఖలు దక్కుతాయని, మరో భాగస్వామి ఆర్‌జేడీకి రెండు కేబినెట్ బెర్త్‌లు ఇస్తారని సమాచారం.

Read More
Next Story