ఏక్ రహోగే తో సేఫ్ రహోగే: ప్రధాని మోదీ
x

'ఏక్ రహోగే తో సేఫ్ రహోగే': ప్రధాని మోదీ

‘‘కాంగ్రెస్-జేఎంఎం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవి ఎంతకైనా దిగజారుతాయి.’’ జార్ణండ్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ.


జార్ఖండ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. అగ్రనేతల ప్రసంగాలు హోరెత్తుతున్నాయి. ఆదివారం జార్ఖండ్ చేరుకున్న ప్రధాని మోదీ బొకారో జిల్లాలో ఏర్పాటుచేసిన ప్రచార సభలో మాట్లాడారు.

‘‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఐక్యతకు కాంగ్రెస్‌ వ్యతిరేకం. కలిసికట్టుగా లేనంతవరకు కేంద్రంలో పాలన సాగించారు. దేశాన్ని దోచుకున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్-జేఎంఎం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవి ఎంతకైనా దిగజారుతాయి. ఉపకులాలను ఒకదానితో ఒకటి ఇరకాటంలో పెట్టడం ద్వారా కాంగ్రెస్‌, జేఎంఎం ఓబీసీల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయని’’ మోదీ ఆరోపించారు.

ఆర్టికల్ 370 గురించి మాట్లాడుతూ..

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కోరుతున్న కాంగ్రెస్ దాని మిత్రపక్షాలపై కూడా ప్రధాని విరుచుకుపడ్డారు. ‘‘కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 తెచ్చారు. ఏడు దశాబ్దాలుగా అక్కడ రాజ్యాంగం అమల్లో లేదు. భారత రాజ్యాంగం పేరుతో తొలిసారిగా జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే అంబేద్కర్‌కు ఆయన అర్పిస్తున్న నివాళి’’ అని మోదీ పేర్కొన్నారు.

రాష్ట్రంలోని హేమంత్ సోరెన్‌ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. చొరబాటుదారులను తరిమికొట్టేందుకు, అవినీతి నిర్మూలనకు జార్ఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అవసరమని అన్నారు. తాము అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారికి కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. Ek rahoge toh safe rahoge: PM at Jharkhand

Read More
Next Story