మహారాష్ట్రలో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్..
‘‘మహారాష్ట్ర ప్రజల కలలను సాకారం చేసేందుకు కలిసి పోరాడుతాం. ఎంవీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం ఉంది.’’ - కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెన్నితాల.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల గురించిన వివరాలు తెలుసుకున్నాక 23 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తొలి జాబితాలో 48 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 25 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలను తిరిగి నామినేట్ చేసింది. సకోలి నుంచి పటోలే, కరాద్ సౌత్ నుంచి మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, బ్రహ్మపురి నుంచి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వడెట్టివార్‌ను పోటీలోకి దింపిన విషయం తెలిసిందే.
మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, శనివారం సాయంత్రంలోగా తమ భాగస్వామ్య పక్షాల మధ్య తుది సీట్ల షేరింగ్ జరుగుతుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. శుక్రవారం జరిగిన సీఈసీ సమావేశం అనంతరం ఆ పార్టీ నేత రమేష్ చెన్నితాల విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మిగిలిన సీట్లపై సీఈసీలో చర్చ జరిగింది. ఎంవీఏ ఐక్యంగా పోటీ చేస్తోంది. మాలో ఎలాంటి విభేదాలు లేవు. మహారాష్ట్ర ప్రజల కలలను సాకారం చేసేందుకు కలిసి పోరాడుతాం. ఎంవీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం ఉంది. అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు.’’ అని కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెన్నితాల అన్నారు.
లోక్‌సభ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ మెరుగ్గా పనిచేస్తుందని, పూర్తి మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పీసీసీ చీఫ్ నానా పటోలే పేర్కొన్నారు. "మేము రాబోయే అసెంబ్లీ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం." అని చర్చల తర్వాత వేణుగోపాల్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాలో అభ్యర్థులు వీరే..
నియోజకవర్గం - అభ్యర్థి పేరు..
1. భుసావల్ – ఎస్సీ: డాక్టర్ రాజేష్ తుకారాం మాన్వత్కర్
2 .జలగావ్ (జామోద్): డాక్టర్ శ్రీమతి. స్వాతి సందీప్ వాకేకర్
3. అకోట్: మహేష్ గంగనే
4. వార్ధా: శేఖర్ ప్రమోద్బాబు షెండే
5. సావ్నర్: శ్రీమతి. అనూజ సునీల్ కేదార్
6. నాగ్‌పూర్ సౌత్: గిరీష్ కృష్ణరావు పాండవ్
7. కమ్తి: సురేష్ యాదవ్రావ్ భోయార్
8. భండారా - SC: శ్రీమతి. పూజ గణేష్ థావ్కర్
9. అర్జుని-మోర్గావ్ - SC: దలీప్ వామన్ బన్సోడ్
10. అమ్‌గావ్ - ఎస్టీ: రాజ్‌కుమార్ లోటుజీ పురం
11. రాలేగావ్: ప్రొ.వసంత్ చిందుజీ పుర్కే
12. యావత్మాల్: అనిల్ @ బాలాసాహెబ్ శంకర్రావు మంగూల్కర్
13. ఆర్ని - ST: జితేంద్ర శివాజీరావు మోఘే
14. ఉమర్‌ఖేడ్ - ఎస్సీ: సాహెబ్రావ్ దత్తరావు కాంబ్లే
15. జల్నా: కలియాస్ కిసన్‌రావ్ గోర్తంత్యాల్
16. ఔరంగాబాద్ తూర్పు: మధుకర్ కృష్ణారావు దేశ్‌ముఖ్
17. వసాయ్: విజయ్ గోవింద్ పాటిల్
18. కండివాలి తూర్పు: కాలు బధేలియా
19. చార్కోప్: యశ్వంత్ జయప్రకాష్ సింగ్
20. సియోన్ కోలివాడ: గణేష్ కుమార్ యాదవ్
21. నీలంగ: హేమంత్ ఒగలే
22. శ్రీరాంపూర్ – ఎస్సీ: అభయ్‌కుమార్ సతీష్‌రావు సలుంఖే
23. శిరోల్: గణపతిరావు అప్పాసాహెబ్ పాటిల్