‘కాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగ్యం కోసం కాంగ్రెస్, మిత్రపక్షాల కుట్ర’
x

‘కాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగ్యం కోసం కాంగ్రెస్, మిత్రపక్షాల కుట్ర’

‘‘బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సర్కారు ఔరంగాబాద్‌ను ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చి, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే కోరికను నెరవేర్చింది.’’- ప్రధాని మోదీ.


కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్రపతి శంభాజీనగర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు. “పాకిస్తాన్ భాష మాట్లాడే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు మీరు మద్దతు ఇస్తారా? అని మోదీ ఓటర్లను ప్రశ్నించారు. భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్‌లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే ఉండాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడని మోదీ పేర్కొన్నారు.

రెండున్నరేళ్లు అధికారంలో ఉండి కూడా..

‘‘ఔరంగాబాద్‌‌ను ఛత్రపతి శంభాజీనగర్‌గా పేరు మార్చాలని బాలాసాహెబ్ ఠాక్రే కోరారు. ఈ విషయం మహారాష్ట్ర మొత్తానికి తెలుసు. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లింది. అయితే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సర్కారు ఔరంగాబాద్‌ను ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చి, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే కోరికను నెరవేర్చింది. రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పేరు మార్చే ధైర్యం చేయలేకపోయింది.’’ అని మోదీ అన్నారు.

మరాఠీకి సాంప్రదాయక భాష హోదా ఇవ్వాలని మహారాష్ట్ర, మరాఠ్వాడా ప్రజలు దశాబ్దాలుగా చేస్తు్న్న డిమాండ్‌ను బీజేపీ నెరవేర్చిందన్నారు. మహాయుతి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహారాష్ట్ర గరిష్ట ఎఫ్‌డీఐని ఆకర్షించింది. పెట్టుబడి వల్ల ప్రజలకు మేలు జరిగింది'' అని పేర్కొన్నారు.

Read More
Next Story