ఎల్లుండి ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారోత్సవం..
x

ఎల్లుండి ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారోత్సవం..

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతిషి సెప్టెంబర్ 21న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గురువారం తెలిపింది.


ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతిశీ సెప్టెంబర్ 21న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గురువారం తెలిపింది. మొదట అతిశీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ పేర్కొంది. అయితే ఆమెతో పాటు కొత్త మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు.

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ, సీబీఐ వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. ఈడీ కేసులో తొలుత బెయిల్ మంజూరుకాగా, సీబీఐ కేసులో కేజ్రీవాల్ ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేదాకా ముఖ్యమంత్రి పదవి చేపట్టనని చెప్పిన కేజ్రీవాల్..రెండు రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అతిషి ఆయన స్థానంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

అతిశీ నేతృత్వంలోని కేబినెట్‌లో సుల్తాన్‌పూర్ మజ్రా ఆప్ ఎమ్మెల్యే ముఖేష్ అహ్లావత్ మంత్రి పదవికి దక్కనుంది. ఆయనకు సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు. ఇదివరకు ఈ శాఖకు మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేసి పార్టీ నుంచి వైదొలిగారు. అప్పటి నుంచి ఆ శాఖ ఖాళీగా ఉంది.

కాగా ఇదివరకటి ఆప్ మంత్రులు గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గహ్లోత్, ఇమ్రాన్ హుస్సేన్ అతిశీ కేబినెట్‌లోనూ అలాగే కొనసాగుతారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Read More
Next Story