మావిగన్‌కు నారా లోకేశ్ ఏమని అర్థం చెప్పారంటే..
x

మావిగన్‌కు నారా లోకేశ్ ఏమని అర్థం చెప్పారంటే..

టీడీపీ శ్రేణుల్లో వైరల్ గా మారిన లోకేష్ సెటైర్.


ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించిన నేపథ్యంలో, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మావిగన్ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. జగన్ ప్రతిపాదించిన ఈ కొత్త కాన్సెప్ట్‌పై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ చెప్పే మావిగన్ వెనుక ఉన్న అసలు అర్థం వేరే ఉందంటూ ఆయన మండిపడ్డారు.

లోకేశ్ వెర్షన్: మా.. వి.. గన్ అంటే ఇదే
జగన్ ప్రతిపాదించిన MAVIGUN (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) అనే పదానికి నారా లోకేశ్ తనదైన శైలిలో కొత్త నిర్వచనం ఇచ్చారు.
'మా' అంటే మాయ..
'వి' అంటే విధ్వంసం..
'గన్' అంటే గందరగోళం లేదా గన్ కల్చర్..
అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ చెప్పే మావిగన్ అంటే ఇదేనా? అంటూ ప్రశ్నిస్తూ.. #MavigunMavayya, #HistoricAmaravatiResolution వంటి హ్యాష్‌ట్యాగ్‌లను జోడించి తన నిరసనను వ్యక్తం చేశారు. లోకేష్ పెట్టిన ఈ పోస్టు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వైరల్ గా మారింది.
ముదురుతున్న రాజధాని సమరం
రాజధాని విషయంలో ఒకవైపు ప్రభుత్వం చారిత్రాత్మక అమరావతి తీర్మానంతో ముందుకు వెళ్తుండగా, ప్రతిపక్ష నేత జగన్ మావిగన్ అంటూ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. జగన్ విమర్శలకు లోకేశ్ ఇచ్చిన ఈ మావిగన్ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజధానిపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది.

Read More
Next Story