బీజేపీపై TVK పార్టీ నాయకుల బహిరంగ విమర్శలు..
x

బీజేపీపై TVK పార్టీ నాయకుల బహిరంగ విమర్శలు..

రాజకీయ ఒత్తిడి కోసమే విజయ్‌పై CBI దర్యాప్తు, జన నాయగన్ సినిమా సర్టిఫికేషన్‌లో జాప్యం


Click the Play button to hear this message in audio format

నెలల తరబడి సంయమనం పాటించిన తర్వాత, తమిళ సినీ నటుడు విజయ్ తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ నాయకులు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టారు. టీవీకే నాయకులు ఇలా బహిరంగ విమర్శలు చేయడం ఇదే ప్రథమం.


TVK రాజకీయ నేపథ్యం..

2024 ప్రారంభం నుంచి DMK, AIADMK పార్టీలను TVK తప్పుబడుతోంది. ద్రావిడ రాజకీయాలకు తమ పార్టీనే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎన్నికలకు హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శిస్తూ వస్తున్నారు. 2026 ఎన్నికలలో TVK–DMK మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని విజయ్ గతంలో చెప్పా్రు కూడా.


విజయ్ మాట్లాడాకే..

"మతవాద శక్తులతో పొత్తు ఉండదని విజయ్ స్పష్టంగా చెప్పాడు. అయినప్పటికీ విమర్శకులు అందరూ బీజేపీపై ఎందుకు దాడి చేస్తున్నారని అడుగుతున్నారు. కానీ టీవీకే మౌనంగా ఉంది" అని టీవీకే ప్రధాన కార్యదర్శి అరుణ్‌రాజ్ ది ఫెడరల్‌తో అన్నారు. "ముందుగా ఎటువంటి ఒత్తిడి లేదు. మా నాయకుడు మాట్లాడిన తర్వాతే బీజేపీ సీబీఐ విచారణ, జన నాయగన్ విడుదలకు అడ్డంకులు సృష్టించింది. ఈ విషయాలు అందరికీ తెలుసు." అని పేర్కొన్నారు. సీబీఐ, ఆడిట్ ఒత్తిళ్లకు విజయ్ ఏమాత్రం లొంగలేదని చెప్పారు.

"ఇంత ఒత్తిడి తర్వాత కూడా మా నాయకుడు మతతత్వ శక్తులతో పొత్తు లేదని చెబుతున్నారు. ఇంకా ఏమి చెప్పాలి?" అని అరుణ్‌రాజ్ అన్నారు.

టీవీకేకు పెరుగుతున్న ప్రజా మద్దతు కారణంగానే దివంగత నటుడు విజయకాంత్ స్థాపించిన దేశియ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK)ను డీఎంకే తన కూటమిలో చేర్చుకుందని అన్నారు.

Read More
Next Story