తమిళనాడు ఎన్నికలు.. డీఎంకే తొలి జాబితా విడుదల..
x

తమిళనాడు ఎన్నికలు.. డీఎంకే తొలి జాబితా విడుదల..

28 మంది మంత్రులకు మళ్లీ అవకాశం.. కొన్ని స్థానాల్లో వారసులకు..


Click the Play button to hear this message in audio format

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ అనుభవజ్ఞులు, కొత్తవారికి సమ ప్రాధాన్యం ఇచ్చారు.

తమిళనాడు శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ, తొలి అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఈ జాబితాను ప్రకటించారు. ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి.

ఏ పార్టీకి ఎన్ని స్థానాలు..

డీఎంకే మొత్తం 164 స్థానాల్లో నేరుగా పోటీ చేస్తుండగా, మిగిలిన 70 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. సీట్ల పంపకం చర్చలు ఎక్కువకాలం సాగడంతో జాబితా ఆలస్యంగా విడుదలైందని స్టాలిన్ తెలిపారు.

మిత్రపక్షాల్లో కాంగ్రెస్‌కు 28, విడుతలై చిరుతైగల్ కట్చికి 8, డీఎండీకేకు 10, సీపీఐ, సీపీఎంలకు 5 స్థానాల చొప్పున కేటాయించారు. ఇతర చిన్న పార్టీలకు కూడా 2 నుంచి 4 స్థానాలు ఇచ్చారు.


మంత్రులకు మళ్లీ టికెట్లు..

డీఎంకే జాబితాలో ప్రధానంగా అనుభవజ్ఞులకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 34 మంది మంత్రుల్లో 28 మందికి మళ్లీ టిక్కెట్లు ఇచ్చారు. అయితే, నలుగురు మంత్రులకు ఈసారి అవకాశం ఇవ్వలేదు.

ముఖ్యమంత్రి స్టాలిన్ తన సంప్రదాయ కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నుంచి మళ్లీ బరిలోకి దిగనున్నారు.

మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని కరూర్ నుంచి కోయంబత్తూరు సౌత్‌కు మార్చారు. సీనియర్ మంత్రి దురై మురుగన్‌ను కట్టుపట్టి నుంచి మళ్లీ నామినేట్ చేశారు.


కొన్ని చోట్ల వారసులకు..

కొన్ని చోట్ల కుటుంబ వారసత్వానికి కూడా ప్రాధాన్యం లభించింది. ఆర్. గాంధీ స్థానంలో ఆయన కుమారుడు వినోత్ గాంధీకి టిక్కెట్ ఇచ్చారు. అలాగే ఐ. పెరియస్వామి కుమారుడు సెంథిల్ కుమార్‌ను కూడా బరిలోకి దింపారు.

ఇటీవలే పార్టీలో చేరిన నేతలకు కూడా అవకాశాలు ఇచ్చారు. ఏఐఏడీఎంకే నుంచి వచ్చిన తోప్పు వెంకటసాలంకు పెరుందరై సీటు కేటాయించారు.

పలు వివాదాల్లో ఉన్న మాజీ మంత్రి పొన్ముడికి టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో కుమారుడు గౌతమ్ సిగమణిని ఎంపిక చేశారు. మంత్రి మనో తంగరాజ్‌కు కూడా ఈసారి అవకాశం దక్కలేదు.

ఈ జాబితాలో 60 మందికి పైగా కొత్త అభ్యర్థులు ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో చాలా మంది చదువుకున్నవారు. మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తూ 18 మందికి టిక్కెట్లు ఇచ్చారు.

ఇటీవల పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వానికి బోడినాయకనూర్ సీటు కేటాయించడం పెద్ద రాజకీయ పరిణామంగా మారింది.

రాజకీయ విశ్లేషకుల ప్రకారం, స్టాలిన్ వ్యూహం సమతుల్యంగా ఉంది. అనుభవజ్ఞులు, యువత, మహిళలు, మైనారిటీలు, కొత్తవారికి అవకాశాలు కల్పించడం ద్వారా విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ జాబితా రూపొందించారు.


పార్టీలు - నియోజకవర్గాల వారీగా..

థోల్ నేతృత్వంలోని విడుతలై చిరుతైగల్ కట్చి (VCK)కి 8 సీట్లు కేటాయించారు. వీటిలో చాలావరకు ఎస్సీ నియోజకర్గాలు. పన్రుటి, కళ్లకురిచ్చి (SC), కట్టుమన్నార్కోయిల్ (SC), పెరియకులం (SC), అరక్కోణం (SC), చెయ్యూర్ (SC), తిరుపోరూర్, తిండివనం (SC).

కాంగ్రెస్‌కు 28 సీట్లు: పొన్నేరి (ఎస్సీ), తిరుపెరంబుదూర్ (ఎస్సీ), షోలింగూర్, ఉదగమండలం, ఈరోడ్ ఈస్ట్, అరంతంగి, కడలూరు, మైలాడుతురై, కారైకుడి, శివకాశి, తిరువాడనై, తిరువైకుండం, నంగునేరి, కులచల్, విలవంకోడ్, కిల్లియూరు (ఉత్తన్‌చెర్రు, వెలైయూరు, వెలైయూరు, వెలైయూర్ కౌండంపళయం, అత్తూర్ (SC), పెన్నాగారం, సింగనల్లూరు, అంబసముద్రం, కృష్ణగిరి, ఉసిలంపట్టి, శంకరన్‌కోవిల్, మేలూర్.

దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం (DMDK)కి 10 సీట్లు: వృద్ధాచలం, విరుదునగర్, ధర్మపురి, గుడియాతం (SC), సేలం వెస్ట్, పోలూరు, పల్లవరం, తిరుత్తణి, ఓమలూరు, మైలం.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI)కి 5 సీట్లు: తాలి, తిరుత్తురైపూండి, భవానీసాగర్, తిరుప్పూర్ నార్త్ (2021లో గెలిచిన స్థానాలు) + కొత్త స్థానం తిరువిల్లిపుత్తూరు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) CPI(M)కి 5 సీట్లు: కిల్వేలూరు, కందర్వకోట్టై (2021లో గెలిచిన స్థానాలు) + పద్మనాభపురం, పళని, తిరువొత్తియూర్ (చెన్నై).

మొత్తంగా, డీఎంకే జాబితా ఎన్నికల కోసం బలమైన సంకేతాలను ఇస్తోంది. నామినేషన్ ప్రక్రియ మార్చి 30న ప్రారంభం కానుంది.

Read More
Next Story