
పశ్చిమ బెంగాల్: ‘భవానీపూర్ ఆర్‌వోను తొలగించాలి’
ఈసీకి టీఎంసీ లేఖ..
పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సురజిత్ రాయ్‌ను తొలగించాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు పార్టీ నేత డెరెక్ ఓ'బ్రియన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, రాష్ట్ర ఎన్నికల అధికారికి మార్చి 24న లేఖ రాశారు. భారతీయ జనతా పార్టీ (BJP) నేత సువెందు అధికారితో సురజిత్ రాయ్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, గతంలో నందిగ్రామ్-IIలో బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేసినప్పుడు సువెందుతో ఆయనకు పరిచయం ఏర్పడిందని డెరెక్ ఓ'బ్రియన్ లేఖలో రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారిగా సురజిత్ రాయ్ ఆయన స్వతంత్రంగా వ్యవహరించగలడా? అని సందేహం వ్యక్తం చేస్తూ.. ప్రస్తుతం ఉన్న పదవి ఆయన సీనియారిటీకి కూడా సరిపోదని లేఖలో పేర్కొన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని సురజిత్ రాయ్ నియామకాన్ని వెంటనే రద్దు చేసి, రాజకీయనాయకులు, పార్టీలతో సంబంధం లేని మరో అధికారిని నియమించాలని టీఎంసీ ఈసీని కోరింది.

