‘‘సీఎం, డిప్యూటీ సీఎం మధ్య మళ్లీ కుర్చీ కోసం యుద్ధం’’
x
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో డీకే శివకుమార్

‘‘సీఎం, డిప్యూటీ సీఎం మధ్య మళ్లీ కుర్చీ కోసం యుద్ధం’’

ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ విమర్శలు


కర్ణాటకలో సీఎం పదవి కోసం సీఎం, డిప్యూటీ సీఎం మధ్య మరోసారి యుద్ధం ప్రారంభం అయిందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్. అశోక పేర్కొన్నారు.

బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని ప్రతిపక్ష బీజేపీ నేత ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై చెడు పాలన ఆరోపణలు చేస్తూ, సోషల్ మీడియా అనలిటిక్స్ పేరుతో నిధులు వృథా చేస్తున్నారని విమర్శించారు.
ఈ ఏడాది జరగనున్న గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) పరిధిలోని ఐదు కార్పొరేషన్‌ల ఎన్నికల్లో బీజేపీ అన్నింటినీ గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదని అన్నారు
సీఎం కుర్చీ కోసం పోరాటం ప్రారంభమైంది. సీఎం కుమారుడు, ఎమ్మెల్సీ అయిన యతీంద్ర సిద్ధరామయ్య తన తండ్రి పూర్తి ఐదేళ్ల కాలం సీఎం‌గా కొనసాగుతారని ప్రకటన చేసి వివాదాన్ని రేపారు” అని అశోక శుక్రవారం అన్నారు.
“కాంగ్రెస్ నాయకులు, శాసనసభ్యులు హైకమాండ్ నిర్ణయం తుది నిర్ణయమే అంటుంటే, యతీంద్ర వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువయ్యాయి ,” అని ఆయన అన్నారు.''ఢిల్లీ లోని కాంగ్రెస్ హై కమాండ్ చచ్చిపోయినట్టే ఉంది"అని ఆయన వ్యాఖ్యానించారు.
“శాసనసభ సమావేశాలు ముగియగానే సీఎం కుర్చీ కోసం పోరు మళ్లీ యుద్ధం మొదలైంది. ఇకపై ఇది రోజూ కొనసాగుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ దుర్వ్యవస్థకు ప్రజలు గుణపాఠం చెబుతారు” అని అశోక చెప్పారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదని, సిద్ధరామయ్యే పూర్తి ఐదేళ్ల కాలం ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టంగా చెప్పిందని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత స్పందించారు.
2023లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య ‘పవర్ షేరింగ్’ ఒప్పందం ఈ ఊహాగానాలకు కారణమైందని తెలిపారు.
జీబీఏ పరిధిలోని ఐదు కార్పొరేషన్‌ల ఎన్నికలపై చర్చించేందుకు శనివారం బీజేపీ సమావేశం ఏర్పాటు చేసిందని అశోక చెప్పారు. “ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. శనివారం జరిగిన సమావేశానికి పార్టీ హైకమాండ్ నియమించిన జీబీఏ ఎన్నికల ఇన్‌చార్జి రామ్ మాధవ్ హాజరయ్యారు.
“మనం బెంగళూరును గెలవాలి. సిద్ధరామయ్య సీఎం‌గా ఉన్నప్పుడు బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచాం. ఇప్పుడు అవినీతి, ధరల పెరుగుదల, పన్నుల భారం పెరగడం వల్ల కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆగ్రహం ఉంది. ఐదు కార్పొరేషన్‌లను గెలిచేలా ప్రణాళిక సిద్ధం చేస్తాం,” అని ఆయన అన్నారు.
జీబీఏ సహా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అశోక ‘తుగ్లక్ తరహా పాలన’గా అభివర్ణించారు.
“రాజీవ్ గాంధీ హయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈవీఎంలను ప్రవేశపెట్టింది. ప్రజలు వాటిని అంగీకరించారు. కోర్టులు కూడా సమర్థించాయి.” అని ఆయన అన్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎక్సైజ్ మంత్రి ఆర్.బి. తిమ్మాపూర్ తొలగింపు కోసం ప్రతిపక్ష నేత అశోక డిమాండ్ చేశారు. ఆయన శాఖలో రూ.6,000 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.
డిజిటల్ కంటెంట్, సోషల్ మీడియా పోస్టులను తనిఖీ చేసి తప్పుడు వార్తల ప్రచారాన్ని అడ్డుకునే ఏఐ ఆధారిత ‘సోషల్ మీడియా అనలిటిక్స్ సొల్యూషన్స్’ సాఫ్ట్‌వేర్‌కు రూ.67.26 కోట్లు మంజూరు చేయడాన్ని అశోక విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకునేందుకే ఈ ఖర్చు అని ఆరోపించారు.
“అభివృద్ధికి డబ్బులు లేవంటారు. జీతాలు అందక ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న ఘటనలున్నాయి. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని వేధించేందుకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు,” అని ఆయన అన్నారు.
“ఇలాంటి విషయాలు అసెంబ్లీలో చర్చించాలి. ఇది పూర్తిగా ప్రజాధనం వృథా చేయడమే,” అని ఆయన అభిప్రాయం పడ్డారు.
కేంద్రం తీసుకొచ్చిన వీబీ–జీ రామ్ జీ చట్టంకు మద్దతుగా బీజేపీ ఇచ్చిన పత్రిక ప్రకటన పార్టీ సొంత నిధులతోనే జరిగిందని అశోక చెప్పారు.
కాంగ్రెస్ మాత్రం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల నిధులను దుర్వినియోగం చేసి కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని విమర్శించిందని ఆరోపించారు. మహాత్మా గాంధీ కార్టూన్‌తో ఉన్న ప్రకటన ద్వారా బీజేపీ జాతిపితను అవమానించిందన్న కాంగ్రెస్ ఆరోపణలను అశోక ఖండించారు.
“కాంగ్రెస్ గాంధీ పేరును దుర్వినియోగం చేసి తన అక్రమాలు, అవినీతిని కప్పిపుచ్చుకుంటోంది. అది చూసి గాంధీ గారే కర్ర ఎత్తి ఉండేవారేమో,” అని ఆయన వ్యాఖ్యానించారు.
Read More
Next Story