తమిళనాడు: డీఎంకే - కాంగ్రెస్ సీట్ షేరింగ్.. రంగంలోకి సోనియా?
x

తమిళనాడు: డీఎంకే - కాంగ్రెస్ సీట్ షేరింగ్.. రంగంలోకి సోనియా?

రాజ్యసభకు నామినేషన్లు 5వ తేదీతో ముగుస్తుండడంతో చర్చల్లో వేగం పెంచిన కాంగ్రెస్ అగ్రనేతలు


Click the Play button to hear this message in audio format

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే సీట్ల సర్దుబాటుపై డీఎంకే-కాంగ్రెస్ మధ్య అనిశ్చితి నెలకొంది. వాస్తవానికి డీఎంకె కాంగ్రెస్‌కు సుమారు 25 సీట్లు ఆఫర్ చేసింది. అయితే కాంగ్రెస్ మరిన్ని కావాలని డిమాండ్ చేసింది. మరోవైపు రాజ్యసభ నామినేషన్లకు మార్చి 5 చివరి తేదీ కావడంతో సీట్ షేరింగ్ విషయాన్ని వీలైనంత త్వరగా

కొలిక్కి తేవాలని కాంగ్రెస్ అగ్రనేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం 11.30 గంటలకు AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కే సెల్వరాజ్ స్టాలిన్‌తో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా పాల్గొన్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే సోనియానే నేరుగా డీఎంకే నాయకులతో వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి.


స్లాలిన్‌కు చిదంబరం ఫోన్..

కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి. చిదంబరం మంగళవారం ఉదయం స్టాలిన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇటు సెల్వపెరుంతగై కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం చెన్నై వస్తున్నారు. ఆయన పర్యటన కేవలం పెళ్లికి మాత్రమే పరిమితమయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ ప్రాముఖ్యతను కలిగి ఉందని తమిళనాడు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

Read More
Next Story