SITలో ‘సీపీఐ(ఎం) ఏజెంట్లు’ ఉన్నారు
x

SITలో ‘సీపీఐ(ఎం) ఏజెంట్లు’ ఉన్నారు

అసెంబ్లీ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఆరోపణ


Click the Play button to hear this message in audio format

కేరళ శబరిమల ఆలయంలో బంగారం దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ బృందంలో సీపీఐ(ఎం), సీఎం కార్యాలయానికి చెందిన “ఏజెంట్లు” ఉన్నారని కాంగ్రెస్ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఆరోపించారు. దర్యాప్తు విషయాలను ఎంపికగా మీడియాకు లీక్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ద్వారపాలక విగ్రహాలు, శ్రీకోవిల్ తలుపుల ఫ్రేముల నుంచి బంగారం దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై SIT దర్యాప్తు కొనసాగుతోంది. దేవస్వం మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ను ప్రశ్నించిన మూడు–నాలుగు రోజుల తర్వాతే ఈ విషయం బయటకు వచ్చిందని సతీశన్ చెప్పారు. అయితే యూడీఎఫ్ కన్వీనర్ అదూర్ ప్రకాష్‌ను ప్రశ్నించే విషయం మాత్రం, ఆయన SIT కార్యాలయానికి చేరుకునేలోపే మీడియాకు లీక్ అయిందని విమర్శించారు.

2017లో శబరిమల ఆలయంలో కొత్త ధ్వజ స్తంభం ఏర్పాటు సమయంలో బంగారం, డబ్బు దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై కేరళ హైకోర్టు విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించిందని సతీశన్ గుర్తుచేశారు. ఆ దర్యాప్తును తమ పార్టీ స్వాగతిస్తోందన్నారు. ధ్వజ స్థంభం ఏర్పాటుకు సంబంధించిన పనులు హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్ సమక్షంలో, నిబంధనలకు అనుగుణంగా జరిగాయని, కమిషనర్ పనిని హైకోర్టు కూడా ప్రశంసించిందని పేర్కొన్నారు.

ద్వారపాలక విగ్రహాలు, శ్రీకోవిల్ తలుపులకు బంగారు పూత పనులు మాత్రం రహస్యంగా జరిగాయని సతీశన్ ఆరోపించారు. తమ పార్టీ దర్యాప్తునకు వ్యతిరేకం కాదని, నిజాలు వెలుగులోకి రావాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.

శబరిమల ధ్వజస్తంభం ఏర్పాటులో అక్రమాలు ఉన్నాయంటూ ఒక భక్తుడు చేసిన ఫిర్యాదు మేరకు చీఫ్ విజిలెన్స్ అధికారి నివేదిక ఆధారంగా హైకోర్టు దర్యాప్తు ఆదేశించింది. ప్రాథమిక విచారణలో గుర్తించిన వ్యత్యాసాలు తీవ్రమైనవని, అవినీతి నిరోధక చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద శిక్షార్హమైన నేరాలుగా పరిగణించాల్సిన అంశాలు ఉన్నాయని చీఫ్ విజిలెన్స్ అధికారి నివేదికలో పేర్కొన్నారు.

Read More
Next Story