‘ఎన్‌సీపీ అధ్యక్ష రేస్‌లో లేను’
x

‘ఎన్‌సీపీ అధ్యక్ష రేస్‌లో లేను’

ఎన్‌సీపీ సీనియర్ లీడర్ ప్రఫుల్ పటేల్..


Click the Play button to hear this message in audio format

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) జాతీయ అధ్యక్ష పదవికి తాను పోటీలో లేనని పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్(Praful Patel) స్పష్టం చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత పార్టీ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలపై బయటి వ్యక్తులు వ్యాఖ్యానించడం సరికాదని అభిప్రాయపడ్డారు. సునేత్రా పవార్‌(Sunetra Pawar)ను శాసనసభా పక్ష నాయకురాలిగా ఎన్నుకోవడం పార్టీ హక్కు అని, శ్రేణుల అభిప్రాయాల మేరకే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అధ్యక్ష పదవి ఖాళీపై మాట్లాడుతూ.. “నేను ఆ పోటీలో లేను. ఈ సమయంలో ఇతర అంశాలపై చర్చ అనవసరం” అని పటేల్ అన్నారు. డిప్యూటీ సీఎం సునేత్రా పవార్ నాయకత్వంలోనే పార్టీ భవిష్యత్తు ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Read More
Next Story