భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ డిమాండ్
x

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ డిమాండ్

స్పష్టత వచ్చే వరకు కేంద్రం ఒప్పందాన్ని నిలిపివేయాలని కోెరిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్


Click the Play button to hear this message in audio format

భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ డిమాండ్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో స్పష్టత వచ్చే వరకు కేంద్రం ఒప్పందాన్ని నిలిపివేయాలని ఆయన కోరారు. “భారత్‌తో వాణిజ్య ఒప్పందంలో మార్పు లేదు” అని ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ట్రంప్ కొత్త పన్ను ప్రకటనతో భారత్ సుంకం 10 శాతానికి తగ్గింది.

అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గ్లోబల్ సుంకాలను (tariffs) రద్దు చేసింది. అవి అమెరికా రాజ్యాంగానికి అనుగుణంగా లేనందున అమల్లోకి రావని స్పష్టం చేసింది. ఈ తీర్పు వల్ల అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలపై చర్చలు మళ్లీ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అలాగే, సుంకాల విధానం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై స్పష్టత అవసరమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Read More
Next Story