
రాజ్యసభకు బీహార్ సీఎం నితీష్..
ఇక ముఖ్యమంత్రి రేస్‌లో ఉన్నదెవరు?
బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికలకు ఆయన నిన్న (మార్చి 5న) నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దీంతో మూడు నెలలకే శాసనసభను వీడి పార్లమెంట్ ఎగువ సభకు వెళ్తున్నట్లు స్పష్టమైంది.
రెండు దశాబ్దాలుగా బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీష్.. తన ఆరోగ్యం క్షీణించటం, రాజకీయ భారం తగ్గించుకోడానికి రాజ్యసభకు వెళ్లినట్లు వార్తలొస్తున్నాయి. ఒకానొక సమయంలో నితీష్ కుమారుడు నిషాంత్ కుమార్ ఎగువ సభకు నామినేషన్ వేస్తారని ఊహాగానాలు వచ్చాయి.
నితీష్ గతంలో 1989–2004 మధ్య లోక్‌సభకు ఆరు సార్లు ఎంపికయ్యారు. అయితే ఇప్పుడు ఆయన రాజ్యసభలోకి కూడా అడుగుపెట్టి తన కలను నెరవేర్చుకున్నారు. పార్టీ సీనియర్ నేతలు, కేంద్ర, రాష్ట్ర నాయకులు సంప్రదింపుల తరువాత కూడా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
పాట్నా రాజకీయ వాతావరణం క్షణం క్షణం మారుతోంది. మంత్రుల పోర్టుపోలియోలు కూడా మారే అవకాశం ఉంది.
నితీష్ సన్నిహితుడు ది ఫెడరల్‌తో మాట్లాడుతూ ..పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరినా, అతను వినిపించుకోలేదని పేర్కొన్నారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా నుంచి కేంద్ర మంత్రులు నిత్యానంద్ రాయ్, గిరిరాజ్ సింగ్, మూడుసార్లు దిఘా ఎమ్మెల్యే సంజీవ్ చౌరాసియా వరకు బీజేపీ చెందిన అనేక మంది ముఖ్యమంత్రి రేస్‌లో ఉన్నారు.

