రాజ్యసభ ఎన్నికల్లో ఎన్ డి ఏ భారీ విజయం
x
బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ కు పుష్ఫగుచ్చం అందిస్తున్న పార్టీ నాయకులు

రాజ్యసభ ఎన్నికల్లో ఎన్ డి ఏ భారీ విజయం

అత్య‌ధిక స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ


బీహార్, ఒడిశా, హర్యానాల్లో జరిగిన రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో 11 స్థానాల్లో ఎన్డీఏ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో బీజేపీ బలపరిచిన ఇండిపెండెంట్ సభ్యులు కూడా ఉన్నారు.

బీహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కొత్తగా క‌మ‌లం పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీహార్ నుంచి జరిగిన ఐదు స్థానాలను కూట‌మి ప్ర‌భుత్వం గెలుచుకుంది.
రాజ్యసభలో మొత్తం 37 ఖాళీలలో, బీహార్, ఒడిశా, హర్యానాల్లోని 11 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. మిగతా సభ్యులు ఇంతకుముందే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల తర్వాత రాజ్యసభలో క‌మ‌లం పార్టీకి మెజారిటీ స్థానాలు ఉంటాయి.
నితీశ్ కుమార్ (జెడియు))తో పాటు, కేంద్ర మంత్రి రామ్ నాథ్ , రాష్ట్రీయ లోక్ మోర్చా నాయకుడు ఉపేంద్ర కుష్వాహా ఎన్నికయ్యారు. వీరిద్ద‌రూ రాజ్య స‌భ‌కు ఎన్నిక కావ‌డం ఇది రెండోసారి. అలాగే మొదటిసారి శివేష్ కుమార్ కు బీజేపీ అవకాశం ఇచ్చింది.

ఒడిశా అభ్యర్థులు వీరే

ఒడిశాలో నాలుగు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం ఐదు అభ్యర్థులు బ‌రిలో నిల్చారు. క‌మ‌లం పార్టీ మూడు స్థానాలు కైవ‌సం చేసుకుంది, ఇక్క‌డ క్రాస్-వోటింగ్ జరిగింది. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బిజూ జ‌న‌తాద‌ళ్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ అభ్యర్థి దిలీప్ రాయ్‌కు ఓటు వేసినట్లు సమాచారం.
ఎన్నికైన వారిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సుజీత్ కుమార్, అలాగే ప్రతిపక్ష బీజూ జ‌న‌తాద‌ళ్ కి చెందిన సంత్రుప్త మిశ్రా ఉన్నారు. బిజ‌పి స‌పోర్ట్ తో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రాయ్ కూడా గెలిచారు.
బీజూ జ‌న‌తాద‌ళ్ అభ్యర్థి , ప్రముఖ యూరాలజిస్ట్ డా. దత్తేశ్వర్ హోటా (కాంగ్రెస్, సిపిఎం మద్దతుతో) పోటీలో ఐదవ అభ్యర్థిగా ఉన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఒడిశా అసెంబ్లీ కార్యదర్శి సత్యబ్రత రౌత్ ఎన్నికైన నలుగురు సభ్యులకు ధృవపత్రాలు అందజేశారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ బిజెపి అభ్యర్థులు , పార్టీ మద్దతు ప్రకటించిన ఇండిపెండెంట్ అభ్యర్థిని అభినందించారు.
హర్యానాలోనూ..
హర్యానాలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క‌మ‌లం పార్టీకి చెందిన సంజయ్ భాటియా కాంగ్రెస్ పార్టీకి చెందిన కరమ్‌వీర్ సింగ్ బౌధ్ రెండు స్థానాలకు ఎన్నికయ్యారు. ఓటు గోప్యత నియ‌మాలు ఉల్లంఘించిన‌ ఆరోపణల నేపథ్యంలో ఈ ఎన్నికలు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ రాత్రి జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విజేతలను అభినందన‌లు తెలిపారు. ఇందులో నాలుగు కాంగ్రెస్ కు చెందినవి కాగా, ఒకటి బీజేపీదిగా తేలింది.
సైనీ మాట్లాడుతూ ఐదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్-వోటింగ్ చేశారని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు బి.కె. హరిప్రసాద్ ఈ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సైనీ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ, వారి ఎమ్మెల్యేలను ఇతర రాష్ట్రాలకు తరలించారని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్‌కు తరలించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు ముందు తిరిగి వచ్చారని తెలిపారు. అలాగే ఐఎన్ఎల్డి పార్టీపై కూడా విమర్శలు చేస్తూ, వారు ఓటింగ్‌లో పాల్గొనకుండా కాంగ్రెస్‌కు పరోక్ష మద్దతు ఇచ్చారని తెలిపారు.
ఐఎన్ఎల్డికి చెందిన అభయ్ సింగ్ చౌటాలా, ఆదిత్య దేవి లాల్ ప్రజల భావాలను దృష్టిలో పెట్టుకుని ఓటింగ్‌లో పాల్గొనలేదని తెలిపారు. 90 సభ్యుల హర్యానా అసెంబ్లీలో క‌మ‌లం పార్టీకి 48, కాంగ్రెస్‌కు 37, ఐఎన్ఎల్ డికి ఇద్ద‌రు , ముగ్గురు స్వతంత్రులు ఉన్నారు.

హర్యానాలో క్రాస్-వోటింగ్

హర్యానాలో క్రాస్-వోటింగ్ జ‌రిగింది. గతంలో కూడా ఇదే క్రాస్ ఓటింగ్ జ‌రిగిన సంద‌ర్బాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది, ఎందుకంటే బిజెపి, కాంగ్రెస్ ఓటు ఉల్లంఘనపై ఫిర్యాదులు చేశాయి. సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ముగిసిసింది. లెక్కింపు 5 గంటలకు మొదలుకావాల్సి ఉండగా ఆలస్యంగా ప్రారంభమైంది.

ఎన్నికైన సభ్యులు

లోక్‌సభ మాజీ ఉపస్పీకర్ ఎం. తంబిదురై (అన్నాడిఎంకె), ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ (కాంగ్రెస్) రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మహారాష్ట్రలో అన్ని ఏడుగురు అభ్యర్థులు మహాయుతి కూటమి ఆరుగురు, ప్రతిపక్ష మహా వికాస్ ఆఘాడి అభ్యర్థి శరద్ పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి అభ్యర్థులు బాబుల్ సుప్రియో, రాజీవ్ కుమార్, మేనక గురుస్వామి, నటుడు కోయెల్ మల్లిక్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిజెపికి చెందిన రాహుల్ సిన్హా కూడా ఎన్నికయ్యారు.

తెలంగాణా నుంచి ఇద్ద‌రు

తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడులో కూడా ఆరు స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్నాడిఎంకె కి చెందిన ఎం. తంబిదురై, పిఎంకె నాయకుడు అంబుమణి రామదాస్, డిఎంకెకి చెందిన తిరుచ్చి శివ, జే కాన్స్టాంటైన్ రవీంద్రన్, కాంగ్రెస్ అభ్యర్థి ఎం. క్రిస్టోఫర్ తిలక్, డిఎంకెకి చెందిన ఎల్.కే. సుదీష్ కూడా ఎన్నికయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అనురాగ్ శర్మ గెలిచారు. రాజ్య స‌భ‌లో బిజెపి ఆధిక్య‌త ప్ర‌ద‌ర్శించ‌డం ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీకి మింగుడు ప‌డ‌టం లేదు.
Read More
Next Story