కశ్మీరీ‌లపై దాడులకు ప్రభుత్వ మద్దతు..
x

కశ్మీరీ‌లపై దాడులకు ప్రభుత్వ మద్దతు..

పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపణ


Click the Play button to hear this message in audio format

కశ్మర్‌పై ఉచ‌కోతకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని పీడీపీ అధ్యక్షురాలు, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ఆరోపించారు. చట్టపాలన బదులుగా ద్వేషం రాజ్యమేలుతుందని అన్నారు. ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న వేధింపుల ఘటన తర్వాత జమ్మూ, కశ్మీరీ ఎంపీలు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సహారన్‌పూర్‌లో ఒక వృద్ధ కశ్మీరీని వేధిస్తున్నట్టు చూపించే వీడియోపై ఆమె స్పందించారు. ఈ సమస్యను లేవనెత్తకపోవడంపై జమ్మూ-కశ్మీర్ ఎంపీలను కూడా ఆమె విమర్శించారు. “మొదట ఉత్తరాఖండ్‌లో యువకుడు తాబిష్‌పై దాడి జరిగింది. ఇప్పుడు ఒక వృద్ధ కశ్మీరీని వేధిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పెరుగుతున్నప్పుడు స్పందించాల్సిన జమ్మూ-కశ్మీర్ ఎంపీలు ఎక్కడ ఉన్నారు?” అని ఆమె ప్రశ్నించారు. జనవరి 28న ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లాలో 18 సంవత్సరాల కశ్మీరీ యువకుడిపై కొంతమంది దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డారు.

Read More
Next Story