
సరిహద్దు కంచె ఏర్పాటు వివాదంపై అమిత్ షా , మమత మధ్య మాటల యుద్ధం
పహెల్గామ్ ఉగ్రవాదులు ఏ రాష్ట్ర సరిహద్దు నుంచి వచ్చారని ప్రశ్నించిన టీఎంసీ చీఫ్..
కేంద్రం హోం మంత్రి అమిత్(Amit shah) షా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడని పశ్చిమ బెంగాల్(West Bengal) సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమవలస దారులు దేశంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు పశ్చిమ బెంగాల్ సరిహద్దు వెంట కంచె ఏర్పాటు చేయాల్సి ఉందని, అయితే దానికి తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదని షా చెప్పడాన్ని మమతా ఖండించారు. అయితే పెట్రాపోల్‌లో భూమి ఎవరు ఇచ్చారు? ఆండల్‌లో భూమి ఎవరు ఇచ్చారు?" అని ప్రశ్నించారు.
బీజేపీ(BJP) నాయకులను మహాభారతంలోని పౌరాణిక పాత్రలైన దుర్యోధనుడు, శ్శాసనులతో పోల్చారు. "బెంగాల్‌కు ఒక దుశ్శాసనుడు వచ్చాడు. ఎన్నికలు రాగానే దుశ్శాసనుడు, దుర్యోధనుడు కనిపించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు శకుని శిష్యుడు దుశ్శాసనుడు సమాచారం సేకరించడానికి వచ్చాడు. రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని, అవినీతి రాజ్యమేలుతుందని, ప్రజా సమస్యలు పట్టడం లేదని పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు. బంకురాను చాలా అభివృద్ధి చేస్తాం. నీటి సంక్షోభాన్ని అధిగమించాం. అసలు ప్రజలను భయపెడుతున్నది బీజేపీనే. S.I.R పేరుతో ప్రజలను వేధిస్తున్నారు" అని కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో కాషాయ పార్టీపై మమత విరుచుకుపడ్డారు.
పశ్చిమ బెంగాల్ సరిహద్దు గుండా చొరబాట్లు.. జాతీయ భద్రతా ముప్పు ఉందన్న షా వ్యాఖ్యలను మమత కౌంటర్ ఇచ్చారు. "వలసదారులు బెంగాల్ నుంచి మాత్రమే వస్తారని వారు (బీజేపీ నాయకులు) అంటున్నారు. మరి పహల్గామ్‌లో జరిగిందేమిటి? ఢిల్లీలో జరిగిన ఘటన వెనుక ఎవరున్నారు?’’ అని షాను ప్రశ్నించారు.
2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో రాష్ట్రంలో పర్యటించడం మొదలుపెట్టారు. టీఎంసీ ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.

