
‘కేరళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు’
‘కేరళ ప్రజలు నా కుటుంబం. మీకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. రాబోయే UDF ప్రభుత్వంతో రాష్ట్రానికి మంచి భవిష్యత్తును అందించేందుకు పని చేస్తా," - రాహుల్ గాంధీ
కేరళ అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు వారాల వ్యవధి మాత్రమే మిగిలి ఉండటంతో రాష్ట్ర ప్రజలు మార్పునకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
రాబోయే యూడీఎఫ్ ప్రభుత్వంతో పాటు ఈ అందమైన రాష్ట్రానికి మంచి భవిష్యత్తును అందించడానికి తాను కష్టపడి పని చేస్తానని రాహుల్ అన్నారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "కేరళ నా ఇల్లు, కేరళ ప్రజలు నా కుటుంబం. ప్రజల ప్రేమకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. రాబోయే UDF ప్రభుత్వంతో రాష్ట్రానికి మంచి భవిష్యత్తును అందించేందుకు పని చేస్తాను," అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
కాంగ్రెస్ రెండు రోజుల్లో 92 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. యూడీఎఫ్ 2016 , 2021లో వరుసగా రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక్కడ సాధారణంగా రెండు స్థానిక కూటములు -యూడీఎఫ్, ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్) మధ్య అధికారం మారుతుంది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించింది.
కేరళ అసెంబ్లీలో 140 స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనుండగా, ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.

