
కేరళ ఎన్నికలు: బీజేపీ థర్డ్ లిస్ట్ రిలీజ్
11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కాషాయ పార్టీ
కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ ఇప్పటికే రెండు విడతలుగా తమ అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా శనివారం మరో 11 మంది పేర్లను మూడో జాబితాగా విడుదల చేసింది. తిరువనంతపురం నియోజకవర్గం నుంచి కరమణ జయన్ బరిలోకి దింపారు. అలాగే పుత్తుపల్లి నుంచి రవీంద్రనాథ్ వాకథానం, చావర నుంచి కేఆర్ రాజేష్, చడయమంగళం నుంచి ఆర్ఎస్ అరుణ్ రాజ్, పీరుమాడే నియోజకవర్గం నుంచి రతీష్ బరిలో నిలిచారు. ఇక అరువిక్కర స్థానం నుంచి వివేక్ గోపన్, కోవలం నుంచి టీఎన్ సురేష్, నెయ్యటింకర స్థానం నుంచి ఎస్.రాజశేఖరన్ నాయర్ పోటీ చేయనున్నారు. మావెలిక్కర స్థానం నుంచి అజిమోన్, చిరాయింకీజు నుంచి బీఎస్ అనూప్, అదూర్ నుంచి పండలం ప్రతాపన్ను పోటీచేస్తున్నారు.
Next Story

