
కేరళ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ సెకండ్ లిస్ట్ రిలీజ్..
39 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీలు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీని, కౌంటింగ్ తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేరళలో గురువారం 39 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితా విడుదల చేసింది.
ఆరన్ముళా స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ మిజోరం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్‌ను పోటీకి దింపారు. అలాగే నట్టిల స్థానం నుంచి సీసీ ముకందన్‌ను పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక తానూర్ స్థానం నుంచి దీపక్ పుళక్కల్, కాసరగోడ్ నుంచి అశ్విని ఎంఎల్ పోటీ చేయనున్నారు. మంజేరి నియోజకవర్గం నుంచి పద్మశ్రీ ఎం, కొంగాడ్ స్థానం నుంచి రేణు సురేష్ బరిలో ఉన్నారు.
ఇదివరకే బీజేపీ తన తొలి జాబితాలో 47 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం విదితమే.

