తమిళనాడు, కేరళ సహా 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇదే!
x

తమిళనాడు, కేరళ సహా 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇదే!

పశ్చిమ బెంగాల్‌లో రెండు విడతలుగా పోలింగ్, పుదుచ్ఛేరికి కూడా ఒకే విడతలో ఎన్నికలు


Click the Play button to hear this message in audio format

కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరిలో శాసన సభా పదవీకాలం మే- జూన్‌ మధ్య ముగియనుంది. దీంతో ఈ రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను ఖరారు చేసింది ఈసీ.

రాష్ట్రాల వారీగా ఎన్నికల తేదీలు - ఫలితాల తేదీలు

  • తమిళనాడు: ఏప్రిల్ 23న పోలింగ్ - మే 4న ఫలితాలు
    • అస్సాం: ఏప్రిల్ 9 న పోలింగ్ - మే 4న ఫలితాలు
  • పుదుచ్చేరి : ఏప్రిల్ 9 న పోలింగ్ - మే 4న ఫలితాలు
  • కేరళ: ఏప్రిల్ 9 న పోలింగ్ - మే 4న ఫలితాలు
  • పశ్చిమ బెంగాల్‌ : రెండు విడతల్లో పోలింగ్
  • మొదటి విడత ఏప్రిల్ 23 (152 స్థానాలకు)
  • రెండో విడత ఏప్రిల్ 29న (142 స్థానాలకు) పోలింగ్
  • - మే 4న ఫలితాలు

అసెంబ్లీల పదవీకాలం పరిశీలిస్తే..

పశ్చిమ బెంగాల్: మే 7, 2026

తమిళనాడు: మే 10, 2026

అస్సాం: మే 20, 2026

కేరళ: మే 23, 2026 .

పుదుచ్చేరి: జూన్ 15, 2026 ముగియనుంది.

ఏ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు..

తమిళనాడు: 234 నియోజకవర్గాలు

కేరళ: 140 నియోజకవర్గాలు

అస్సాం: 126 నియోజకవర్గాలు

పశ్చిమ బెంగాల్: 294 నియోజకవర్గాలు

పుదుచ్చేరి: 30 నియోజకవర్గాలు

అమల్లోకి ఎలక్షన్ కోడ్..

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన క్షణం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. ఈ రాష్ట్రాలలో 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు అన్ని కూడా ఈవీఎంలోనే నిర్వహిస్తామని అన్నారు. పారదర్శక ఎన్నికల కోసమే ఎస్ఐఆర్ నిర్వహించినట్లు చెప్పారు. యువత ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

స్వయంగా పర్యటిస్తాం..

ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో తాము స్వయంగా పర్యటించినట్లు సీఈసీ వెల్లడించారు. జిల్లా ఎలక్టోరల్ అధికారులు, ఎస్పీలు, డీఐజీలతో సమావేశం నిర్వహించామని భద్రతాపరమైన అన్ని అంశాలను పరిశీలించామని చెప్పారు.

విధుల్లో 25 లక్షల మంది అధికారులు..

ఎన్నికల నిర్వహణ కోసం 15 లక్షల మంది సిబ్బంది, 25 లక్షల మంది అధికారులు, 8.5 లక్షల మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు సీఈసీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల కోసం 2.18 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులు, వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. నాలుగు రాష్ట్రాలలో మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

Read More
Next Story