congress, Rahul
x

సమావేశంలో ఖర్గే, రాహుల్

జార్ఖండ్‌ కాంగ్రెస్ నేతలకు హై కమాండ్ స్ట్రాంగ్ వార్నింగ్..

మంత్రులపై అసంతృప్త ఎమ్మెల్యేలు ఎందుకు ఫిర్యాదు చేశారు. రాహుల్ చేసిన సూచనేంటి?


Click the Play button to hear this message in audio format

పార్టీలో విభేదాలుంటే ప్రజా వేదికల మీద బయటపెట్టొదు. పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించండి. పార్టీకి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించం. మీ రాజకీయ ఉనికికి కారణం కాంగ్రెస్ పార్టీయేనన్న విషయం గుర్తుంచుకోండి - రాహుల్ గాంధీ

జార్ఖండ్‌(Jharkhand)లో కాంగ్రెస్‌(Congress)కు కేటాయించిన మంత్రి పదవుల్లో మార్పులు చేయాలన్న కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్లపై పార్టీ హైకమాండ్ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు ఉండబోవని పార్టీ అగ్ర నాయకత్వం తేల్చి చెప్పింది. బుధవారం (జనవరి 28) న్యూఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Kharge) నివాసంలో జరిగిన సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi), జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు పార్టీ అగ్ర నాయకులు జార్ఖండ్ కాంగ్రెస్ నేతలతో చర్చించారు.

‘‘బహిరంగంగా వద్దు’’

ఈ సందర్భంగా క్రమశిక్షణపై పార్టీ నాయకత్వం గట్టిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రజా వేదికల మీద కాకుండా సమస్యలు, ఫిర్యాదులుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించాలని స్పష్టం చేసింది. అంతర్గత విభేదాలకు దూరంగా ఉండి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించింది.

“మీ రాజకీయ ఉనికికి కారణం కాంగ్రెస్ పార్టీయేనన్న విషయం గుర్తుంచుకోవాలి” అని ఖర్గే, రాహుల్ గాంధీలు జార్ఖండ్ యూనిట్ నాయకులకు చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఎమ్మెల్యేల ఫిర్యాదు..

గత వారం ఐదుగురు అసంతృప్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఖర్గే, వేణుగోపాల్‌ను కలిశారు. ప్రస్తుతమున్న నలుగురు కాంగ్రెస్ మంత్రులు ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారని, దీని వల్ల ప్రజల్లో , ఎమ్మెల్యే ల్లో అసంతృప్తి పెరుగుతోందని వారు నాయకత్వానికి వివరించారు.

అయితే పార్టీ అంతర్గత వర్గాల ప్రకారం, ప్రస్తుత మంత్రివర్గమే తుది నిర్ణయమని, ఎలాంటి పునర్వ్యవస్థీకరణ ఉండబోదని హైకమాండ్ స్పష్టం చేసింది. రాధాకృష్ణ కిషోర్ ఎస్సీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆర్థిక అంశాలపై మంచి అవగాహన ఉందని అందుకే ఆయనకు ఆ శాఖ అప్పగించారని పార్టీ నేతలు పేర్కొన్నారు.

ఇర్ఫాన్ అన్సారీ రాష్ట్రంలో కీలకమైన ముస్లిం నాయకుడిగా ఉన్నందున ఆయన స్థానాన్ని మార్చేందుకు కూడా నాయకత్వం సిద్ధంగా లేదని సమాచారం. అలాగే దీపికా పాండే సింగ్ (ఓబీసీ), శిల్పి నేహా టిర్కీ (ఆదివాసీ)లు ఆయా వర్గాలకు చెందిన ముఖ్యమైన మహిళా నేతలుగా పార్టీ భావిస్తోంది.

సమావేశం అనంతరం జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేష్ పార్టీ లోపల ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. SIR అంశం, బూత్ స్థాయి సంస్థ బలోపేతం, MNREGS అమలు, పార్టీ సంస్థాగత పునరుద్ధరణపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిపారు.

అలాగే PESA చట్టం అమలును “గొప్ప విజయంగా” జరుపుకోవడానికి జార్ఖండ్‌కు రావాలని రాష్ట్ర నాయకత్వం రాహుల్ గాంధీని ఆహ్వానించింది. పార్లమెంటు సమావేశాల అనంతరం జార్ఖండ్‌కు వస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Read More
Next Story