ప్రశాంత్ కిషోర్ పిటీషన్‌పై రేపు సుప్రీంలో విచారణ..
x

ప్రశాంత్ కిషోర్ పిటీషన్‌పై రేపు సుప్రీంలో విచారణ..

మహిళా ఓటర్లకు రూ. 10వేలు నగదు బదిలీ చేసి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని కోర్టులో కేసు వేసిన జన్ సురాజ్ పార్టీ చీఫ్..


Click the Play button to hear this message in audio format

2025 బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికలకు ముందు, మహిళా ఓటర్లకు రూ. 10వేలు నగదు బదిలీ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిందని ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్(Jan Suraaj) పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టును కోరారు.ఈ కేసు శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తి జోయ్‌మాల్య బాగ్చి ధర్మాసనం ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 243 స్థానాల్లో 202 స్థానాలు గెలుచుకుంది. ఇక ఇండియా కూటమికి కేవలం 35 స్థానాలే దక్కాయి. ఇందులో కాంగ్రెస్‌కు ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి. జన్ సురాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

Read More
Next Story