
నెక్ట్స్ సీఎం నినాదాలకు దూరంగా పరమేశ్వర..
సరైన సమయంలో అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందన్న కర్ణాటక హోం మంత్రి
తను అనుచరుల నినాదాలతో తనకు ఏ సంబంధం లేదని కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర క్లారిటీ ఇచ్చారు. తుమకూరులో కొంతమంది మంత్రి అనుచరులు ‘నెక్ట్స్ సీఎం పరమేశ్వర’ అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాల వెనక తనకు ఎలాంటి ప్రమేయం లేదని బెంగళూరులో విలేఖరులతో అన్నారు. ఏ నిర్ణయమయినా అధిష్టానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు.
"ఇక్కడ నా శ్రేయోభిలాషులు తమ భావాలను వ్యక్తం చేసి ఉండవచ్చు. అలా నినదించవద్దని వారికి చెప్పా," అని పరమేశ్వర చెప్పారు.
ఇక తప్పిపోయిన పిల్లల కేసు విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వీసా గడువు ముగిసినా కూడా దేశంలో ఉన్న విదేశీయులను గుర్తించాలని పోలీసులకు సూచించామన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టుల నియామకాలు దశలవారీగా చేపడతామని, ఉపాధి కల్పన, ఇతర పరిపాలనా అంశాలపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
Next Story

