‘కాంగ్రెస్ అనవసర భయాలు సృష్టిస్తోంది’
x

‘కాంగ్రెస్ అనవసర భయాలు సృష్టిస్తోంది’

అస్సాంలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన


Click the Play button to hear this message in audio format

అస్సాంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. సిల్చర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇరాన్, ఇజ్రాయిల్- అమెరికా దేశాల మధ్య జరుగుతోన్న యుద్ధం నేపథ్యంలో భారత ప్రజలపై ఆర్థిక భారం పడకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా వ్యవహరించకుండా, అనవసర భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.


కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు..

కాంగ్రెస్ పార్టీ ఈశాన్య ప్రాంతాన్ని దశాబ్దాల పాటు నిర్లక్ష్యం చేసిందన్నారు. అస్సాంలోని బరాక్ వ్యాలీ ప్రాంత అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సరిహద్దు నిర్ణయాల వల్ల బరాక్ వ్యాలీకి సముద్ర మార్గం మూసుకుపోయిందని, ఫలితంగా ఆ ప్రాంతానికి ఉన్న చారిత్రాత్మక వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిపారు.

ఒకప్పుడు వ్యాపారం, పారిశ్రామిక రంగానికి ప్రముఖ కేంద్రంగా ఉన్న బరాక్ వ్యాలీ, కాంగ్రెస్ పాలనలో తన బలాన్ని కోల్పోయిందని ప్రధాని అన్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చేందుకు బీజేపీ కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలో అస్సాంలో యువత హింస, ఉగ్రవాద మార్గాల వైపు మళ్లారని ఆరోపించారు. అయితే అధికారంలోకి రాగానే బీజేపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పిస్తుందని హామీ ఇచ్చారు.


కాంగ్రెస్ ప్రతిస్పందన..

ప్రధాని పర్యటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. అస్సాంలో ఎన్నికలు సమీపిస్తున్నందునే ప్రధాని పర్యటిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఇది కేవలం ఎన్నికల ప్రచారం కోసం మాత్రమేనని మండిపడ్డారు.

Read More
Next Story