కేరళ అసెంబ్లీ ఎన్నికలు:  బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్
x

కేరళ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

47 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కాషాయ పార్టీ - ఏప్రిల్ 9న పోలింగ్ - మే 4న కౌంటింగ్ ..


Click the Play button to hear this message in audio format

కేరళ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 47 మంది అభ్యర్థులతో ఈ జాబితాను ప్రకటించింది. రాష్ట్రంలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది.

గత కొన్ని సంవత్సరాలుగా కేరళలో తన రాజకీయ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ, ఈసారి ఎన్నికలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంది. రాష్ట్రంలో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)లతో కలిసి త్రిముఖ పోటీ ఏర్పడనుంది. బీజేపీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) తరఫున పోటీ చేస్తోంది.

ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన ఒక రోజు తర్వాత బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 71 సీట్లు గెలవాలి. ఎన్నికల ఫలితాలు మే 4న ప్రకటించబడనున్నాయి.


పోటీలో ముఖ్య నాయకులు..

బీజేపీ విడుదల చేసిన జాబితాలో పలువురు ప్రముఖ నేతలు ఉన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ నేమోమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ కేంద్ర మంత్రి వి. మురళీధరన్ కజకూట్టం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. ప్రస్తుత కేంద్ర మంత్రి జార్జ్ కురియన్‌ను కంజిరప్పల్లి నుంచి పోటీ చేయడానికి పార్టీ నామినేట్ చేసింది.

బీజేపీ 47 మంది అభ్యర్థులు, వారి నియోజకవర్గాల పూర్తి జాబితా..

♦ కె సురేంద్రన్, మంజేశ్వర్

♦ మాన్యులాల్ మేలోత్, ఉద్మా

♦ బాల్‌రాజ్ ఎం, కన్హాంగడ్

♦ ఎ.పి. గంగాధరన్, పయ్యన్నూర్

♦ కె.కె. వినోద్ కుమార్, అళికోడ్

♦ సి రఘునాథ్, కన్నూర్

♦ పి శ్యామ్ రాజ్, మనంతవాడి

♦ కవిత ఏఎస్, సుల్తాన్ బతేరి

♦ కె దిలీప్, వడకర

♦ రామదాస్ మనలేరి, కుట్టియాడి

♦ సీపీ విపిన్ చంద్రన్, నాదాపురం

♦ సీఆర్ ప్రఫుల్ కృష్ణన్, క్విలాండి

♦ ఎం మోహనన్ మాస్టర్, పెరంబ్ర

♦ సి.పి. సతీషన్, బలుస్సేరి

♦ టి దేవదాస్, ఎలాతూర్

♦ నవ్య హరిదాస్, కోజికోడ్ నార్త్

♦ టి రనీష్, కోజికోడ్ సౌత్

♦ కె.పి. ప్రకాష్ బాబు, బేపూర్

♦ వీకే సజీవన్, కూన్నమంగళం

♦ సంకు టి దాస్, షోర్నూర్

♦ మేజర్ రవి, ఒట్టప్పలం

♦ సి కృష్ణకుమార్, మలంపుజ

♦ శోభా సురేంద్రన్, పాలక్కాడ్

♦ కె బాలకృష్ణన్, చెలక్కర

♦ కె.కె. అనీష్ కుమార్, మనలూరు

♦ పద్మజ వేణుగోపాల్, త్రిసూర్

♦ సంతోష్ చెరకులం, ఇరింజలకుడ

♦ ఎస్ రాజేంద్రన్, దేవికులం

♦ షోన్ జార్జ్, పాలా

♦ కె అజిత్, వైకోమ్

♦ జార్జ్ కురియన్, కంజిరపల్లి

♦ పిసి జార్జ్, పూంజర్

♦ అరుణ్ అనిరుధన్, అంబలప్పుజ

♦ సందీప్ వాచస్పతి, హరిపాడు

♦ ఎం.వి. గోపకుమార్, చెంగన్నూర్

♦ అనూప్ ఆంటోని జోసెఫ్, తిరువళ్ల

♦ జితిన్ దేవ్, కరునాగపల్లి

♦ రాజి ప్రసాద్, కున్నత్తూర్

♦ ఆర్ రేష్మి, కొట్టారక్కర

♦ బి.బి.గోపకుమార్, చత్తన్నూర్

♦ పి సుధీర్, అట్టింగల్

♦ యువరాజ్ గోకుల్, నెదుమంగడ్

♦ వి మురళీధరన్, కజకూట్టం

♦ ఆర్ శ్రీలేఖ, వట్టియూర్కావు

♦ రాజీవ్ చంద్రశేఖర్, నెమం

♦ గిరీష్ నెయ్యర్, పరస్సాల

♦ పి.కె. కృష్ణదాస్, కట్టక్కడ

Read More
Next Story