
అస్సాం అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
88 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ..
అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గురువారం తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 88 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. బుధవారం సాయంత్రం పార్టీ చీఫ్ నితిన్ నబిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. బీజేపీ అస్సాం యూనిట్ చీఫ్ దిలీప్ సైకియా కూడా ఈ సమావేశంలో ఉన్నారు.
జలుక్‌బరి స్థానం నుంచి ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పోటీ చేస్తున్నారు. దిస్పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు ప్రద్యుత్ బోర్డోలోయ్‌ను తన అభ్యర్థిగా ప్రకటించింది. బుధవారం హిమంత బిస్వా శర్మ ఇతర పార్టీ నాయకుల సమక్షంలో బోర్డోలోయ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన భూపేన్ కుమార్ బోరా బిహ్‌పురా స్థానం నుంచి పోటీ చేయనున్నారు. బిర్సింగ్-జరువా నుంచి మాధవి దాస్, చమారియా నుంచి జ్యోత్సనా కలిత, మంగళ్‌దై నుంచి నీలిమా దేవి బరిలోకి దిగనున్నారు.

