
‘బంగ్లా యువ సాథి’ ప్రారంభం
సీఎం మమత బెనర్జీ మహిళా దినోత్సవ కానుక
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8న) సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, 'బంగ్లార్ యువ సాథి' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 21 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న 10వ తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువకులకు నెలకు రూ. 1,500 అందజేయనున్నారు. వాస్తవానికి ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7 నుంచి ప్రారంభమవుతుందని మమతా బెనర్జీ తెలిపారు. ఈ పథకం కింద దాదాపు కోటి మంది యువతకు నగదు అందనుంది.
"ఈ పథకం నిరుద్యోగులకు స్వావలంబన కలిగిస్తుంది. గతంలో చెప్పినట్టు ఏప్రిల్ 1న ఈ పథకాన్ని ప్రారంభించాలనుకున్నా. అయితే మహిళా దినోత్సవం రోజునే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం," అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
ఉపాధి అవకాశాలు..
బెంగాల్‌లో నిరుద్యోగ రేటు 40 శాతం తగ్గిందని, కనీసం 40 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించినట్టు మమతా బెనర్జీ చెప్పారు. "మా ప్రభుత్వం పరిశ్రమలతో, పారిశ్రామికవేత్తలతో సంబంధాలు ఏర్పరుచుకుని యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. 10 లక్షల మంది ఇప్పటికే ఉద్యోగాలు పొందారు," అని చెప్పారు.
రైతుల కోసం..
రైతులకు రూ. 10వేలు ప్రతి నెల అందించనున్నట్టు ప్రకటించారు. "భూమి లేని రైతులకు కూడా గతంలో ఇచ్చిన రూ. 4వేలు ఇప్పుడు కూడా అందిస్తాం," అని చెప్పారు.
ఆర్థిక అభివృద్ధి..
బెంగాల్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందని, రాష్ట్రంలో ఆరు ఆర్థిక కారిడార్‌లను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సల్బోనిలో 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తున్నామని చెప్పారు.
స్వయం సహాయక సంఘాలు..
రాష్ట్రంలో 12 లక్షల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళలు కూడా బాగా పనిచేస్తున్నారు," అని ఆమె పేర్కొన్నారు.
భవిష్యత్తులో..
బిర్భూమ్ జిల్లాలో 1 లక్ష మందికి ఉపాధి కల్పించే బొగ్గు నిల్వను ప్రారంభించనున్నామని, తద్వారా రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని మమతా బెనర్జీ చెప్పారు.
ఆర్థిక పరిస్థితి:
బెంగాల్‌లో ఉన్న అప్పు 6 లక్షల కోట్లను తిరిగి చెల్లించామని, ఇంకా 2 లక్షల కోట్ల కేంద్ర నిధులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, బెంగాల్ GSDP అత్యధికంగా ఉందని, ఆదాయ ఉత్పత్తిలో కూడా అత్యధికం అని ఆమె తెలిపారు.

