పశ్చిమ బెంగాల్‌‌లో గెలిచితీరుతాం: అమిత్ షా
x

పశ్చిమ బెంగాల్‌‌లో గెలిచితీరుతాం: అమిత్ షా

అధికారంలోకి రాగానే చొరబాటుదారులను తరిమేస్తామన్న కేంద్ర హోంమంత్రి


Click the Play button to hear this message in audio format

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చొరబాటుదారులను తరిమేస్తామని పేర్కొన్నారు. అరారియా జిల్లాలో సశస్త్ర సీమా బల్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చొరబాటుదారులు జాతీయ భద్రతకు ముప్పు అని చెప్పిన షా.. వారి వల్ల జనాభా సమతుల్యతకు ఇబ్బందికరమన్నారు. సీమాంచల్ ప్రాంతం గురించి ప్రస్తావిస్తూ.. పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో ఇలాంటి జనాభాపర ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. అనంతరం వినాయక్ దామోదర్ సావర్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళి అర్పించారు. "1857 తిరుగుబాటు.. మొదటి స్వాతంత్ర్య యుద్ధంగా చూడటానికి సావర్కర్ పోరాటం ఎంతో ముఖ్యమని" ఆయన పేర్కొన్నారు.

Read More
Next Story