మహారాష్ట్ర: అజిత్ పవార్ తర్వాత ఎవరు?
x

మహారాష్ట్ర: అజిత్ పవార్ తర్వాత ఎవరు?

NCP, NCP (SP) కలువనున్నాయా? ఉపముఖ్యమంత్రి రేస్‌లో ఎవరున్నారు?


Click the Play button to hear this message in audio format

మహారాష్ట్ర(Maharashtra) ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) మరణం తర్వాత ఆ పదవికి ఎవరు అర్హులు అనే ప్రశ్న ఉత్పన్నమైంది. అజిత్ భార్య సునేత్రా(Sunetra) పవార్‌కు మంత్రివర్గంలో స్థానం, నాయకత్వ వారసత్వంపై శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల మధ్య సుదీర్ఘంగా చర్చలు కొనసాగుతున్నాయి.


విలీనమవుతాయా?

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన తరువాత.. పార్టీ భవిష్యత్తు నాయకత్వంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం నాయకులు అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఒత్తిడి చేస్తుండగా, మరో వర్గం శరద్ పవార్ నేతృత్వంలోని NCP (SP) తో విలీనం కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

సునేత్రా పవార్‌ను రాష్ట్ర కేబినెట్లో చేర్చాలని పార్టీలోని కొన్ని వర్గాలు ఒత్తిడి తెస్తున్నాయని NCP సీనియర్ నాయకుడు , మంత్రి నరహరి జిర్వాల్ పేర్కొన్నారు.

‘సునేత్రాను మంత్రివర్గంలో చేర్చుకోవడం గురించి పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం’ అని అజిత్ పవార్‌కు అత్యంత సన్నిహితుడైన జిర్వాల్ చెప్పారు. అజిత్ పవార్ స్వస్థలం పూణే జిల్లాలోని బారామతిలో అజిత్ అంత్యక్రియల పూర్తయ్యాక ఆయన ఈ వాఖ్యలు చేశారు.


విలీనం గురించి ఎవరు ఏమంటున్నారు?

NCP, NCP (SP)ల విలీనం గురించి అడిగినప్పుడు..రెండు పార్టీలు ఇప్పటికే కలిసి ఉన్నాయని, మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య కుదిరిన పొత్తు అందుకు నిదర్శమని మరో మంత్రి నరహరి జిల్వాల్ పేర్కొన్నారు.

''రెండు వర్గాలు ఇప్పటికే కలిసి ఉన్నాయి. మనం కలిసి ఉండాలి అని అందరూ గ్రహించారు, ”అని జిల్వాల్ అన్నారు. విలీనంపై తుది నిర్ణయం అజిత్ కుటుంబసభ్యులు, శరద్ పవార్ తీసుకోవాలని NCP నాయకుడు మాజీ మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో NCP టికెట్‌పై పోటీ చేసిన సునేత్రా పవార్.. బారామతిలో NCP (SP) వర్కింగ్ ప్రెసిడెంట్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే చేతిలో ఓడిపోయారు.


ఎన్నికల తర్వాతే..

రెండున్నర నెలల చర్చల తర్వాత శరద్ పవార్ అనుమతితో రెండు వర్గాలను విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఎన్‌సీపీ (ఎస్పీ) నాయకుడు ఏక్‌నాథ్ ఖడ్సే పేర్కొన్నారు. ఇప్పుటికే అనేక రౌండ్ల చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 5న జరుగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో గడియారం గుర్తు (ఎన్‌సీపీ)పై పోటీ చేయాలని నిర్ణయించారు. ఎన్నికల తర్వాత విలీనంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన అన్నారు.

డిప్యూటీ సీఎంగా సునీల్ తత్కరే?

ఉప ముఖ్యమంత్రి , ఆర్థిక మంత్రి పదవి సీనియర్, అనుభవజ్ఞుడైన నాయకుడికే దక్కాలని పార్టీలోని ఒక వర్గం అభిప్రాయపడుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవికి సునీల్ తత్కరే పేరును ప్రతిపాదించారని హిందూస్తాన్ టైమ్స్ నివేదిక పేర్కొంది. "ఆయన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ పదవికి ఆయనే సరైన వ్యక్తి’’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని NCP సీనియర్ అధికారి ఒకరు అన్నారు. "ఆయన 15 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. జల వనరులతో పాటు ఆర్థిక శాఖను కూడా నిర్వహించారు."అని చెప్పారు.

తత్కరే వెనుకబడిన సామాజిక (OBC) వర్గానికి చెందినవారు. అజిత్ పవర్ మరణం తర్వాత NCP , NCP (SP)ల మధ్య పొత్తు ఉంటుందా? ఆనేది తేలాల్సి ఉంది.

Read More
Next Story