
భారత గ్రానైట్ పరిశ్రమకు భారీ దెబ్బ..
కర్ణాటక–ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం..
ఇరాన్, ఇజ్రాయిల్-అమెరికా మధ్య కొనసాగుతోన్న యుద్ధం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రానైట్ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లాలో లభ్యమయ్యే ప్రీమియం బ్లాక్ గ్రానైట్‌కు అమెరికా, యూరప్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అయితే షిప్పింగ్‌లో అంతరాయాల కారణంగా ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ప్రత్యక్షంగా 20వేలు, పరోక్షంగా లక్ష మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతోంది.
ఇక చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, కుప్పం ప్రాంతాల్లో 60 శాతం క్వారీలు మూతపడాయి. రాయల్టీలు, డీజిల్, కార్మిక ఖర్చులు పెరగడంతో ఎగుమతులు తగ్గాయి. ప్రకాశం జిల్లాలోని చిమకుర్తి ‘బ్లాక్ గెలాక్సీ’ గ్రానైట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. 500 ఎకరాల్లో 40 క్వారీలు, 1,600 ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయి. నెలకు సుమారు 60వేల క్యూబిక్ మీటర్లు తవ్వకాలు జరుగుతాయి. కానీ యుద్ధం తర్వాత సగం సరుకులు గల్ఫ్ దేశాల పోర్టుల్లో నిలిచిపోయాయి. 20 అడుగుల కంటైనర్ రవాణాకు ఇప్పుడు రూ.1.4–2 లక్షల ఖర్చువుతోంది.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రానైట్ పరిశ్రమలు యుద్ధ ప్రభావంతో గణనీయమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రత్యేకంగా ‘బ్లాక్ గెలాక్సీ’ రాయిని ఉత్పత్తి చేసే కేంద్రాలు షిప్పింగ్ అంతరాయాలు, పెరుగుతున్న వ్యయాలు కారణంగా తీవ్రమైన సమస్యలకు గురయ్యాయి. పరిశ్రమలు మరింత స్థిరత్వం కోసం ప్రభుత్వం నుంచి మద్దతు ఆశిస్తున్నాయి.

