అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు..
x

అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు..

గల్ఫ్ వెళ్లే ప్రయాణాలకు అంతరాయం


Click the Play button to hear this message in audio format

అమెరికా, ఇజ్రాయిల్ - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అబుదాబి, దోహా, జెడ్డా, కువైట్, రియాద్‌లకు కొచ్చి, తిరువనంతపురం, కోల్‌కతా నుంచి వెళ్లే విమానాలను నిలిపేశారు. గత రెండు రోజుల్లో భారత్ నుంచి వివిధ గమ్యస్థానాలకు వెళ్లే 760 అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. సోమవారం (మార్చి 2) కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాలు, వరుసగా మూడో రోజు కూడా నడవలేదు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కోల్‌కతా నుంచి వెళ్లాల్సిన 20 సర్వీసులు కూడా రద్దయినట్లు కోల్‌కతా విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. మార్చి 3, 2026 నుంచి జోర్డాన్, దోహా, కువైట్, రియాద్‌లకు బయలుదేరే అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు అకాసా ఎయిర్ ప్రకటించింది. మార్చి 7, 2026 వరకు ఈ నగరాలకు లేదా అక్కడి నుంచి చేసిన అన్ని బుకింగ్‌లను రద్దు చేసుకుని పూర్తి డబ్బును తిరిగి పొందవచ్చని లేదంటే ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకోవచ్చు అని తెలిపింది. తమ సర్వీసులను కూడా నిలిపివేస్తున్నట్లు ఖతార్ ఎయిర్‌వేస్, ఇండిగో కూడా పేర్కొన్నాయి.

Read More
Next Story