
పాక్ ప్రధాని షహాబాజ్ షరీఫ్
మా డ్యాముల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాము: పాక్ ప్రధాని
సింధు నదీ జలాల ఒప్పందం రద్దు పై భారత్ పై విమర్శలు
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ నిర్ణయం తీసుకుంది. దీనితో పాక్ లో నీటికి కటకట ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించిందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మంగళవారం చెప్పారు.
నేషనల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ ను సందర్శించిన సందర్భంగా మాట్లాడిన పాకిస్తాన్ ప్రధాని, భారత్ పై విమర్శలు గుప్పించారు. న్యూఢిల్లీకి ఒప్పందాన్ని ‘‘ఏకపక్షంగా’’ నిలిపివేసే అధికారం లేదన్నారు.
నీటి నిల్వ సామర్థ్యం..
ఇండస్ వాటర్ ట్రీటీకి వ్యతిరేకంగా భారత్ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని షరీఫ్ ఆరోపించారని పాకిస్తాన్ పత్రిక పేర్కొంది. ‘‘దానికోసం మేము నీటి నిల్వను నిర్మించుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది’’ అని ఆయన చెప్పినట్లు డాన్ పేర్కొంది.
డైమర్ భాషా ఆనకట్టతో సహ అందుబాటులో ఉన్న వనరులు, మౌలిక సదుపాయాలను ఉపయోగించడం ద్వారా పాకిస్తాన్ ‘‘వివాదాస్పద నీటి నిల్వ సామర్థ్యాన్ని’’ పెంచుకుందని షరీఫ్ అన్నారు.
నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించడం పై సింధు వాటర్ ట్రీటీలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. రాబోయే కొన్ని సంవత్సరాలలో పాకిస్తాన్ తన సొంత వనరులను ఉపయోగించి నీటి నిల్వసామర్థ్యాన్ని పెంచుతుందని, ఇందులో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ కీలక పాత్ర పోషిస్తుందని షరీఫ్ అన్నారు.
ఒప్పందం ప్రకారం భారత్ నీటి వాటాను ఇవ్వడానికి నిరాకరిస్తే పాకిస్తాన్ యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్థారీ చేసిన బెదిరింపు ను భారత్ తోసిపుచ్చిన తరువాత కొన్ని రోజుల తరువాత ఈ వ్యాఖ్య చేశారు.
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడుతూ.. భారత్ ఇటువంటి తప్పుడు బెదిరింపుల గురించి ఆందోళన చెందడం లేదని అన్నారు. నీరు ఎక్కడికి(పాక్ కు) పోదని అన్నారు. అంతకుముందు హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. భారత్ ఎప్పటికీ సింధు ఒప్పందాన్ని పునరుద్దరించదని అన్నారు.
‘‘సింధు నదీపై ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఇది చట్ట విరుద్దం. సింధు నదీ ఒప్పందం నియమాలకు ఇది విరుద్దం. పాకిస్తాన్ కట్టుబడి ఉంది కానీ భారత్ మాత్రం పట్టించుకోవట్లేదు. యూన్ చార్టర్ ప్రకారం.. నీటిని ఆపే బెదిరింపు చట్ట విరుద్దం’’ అని పార్లమెంట్ ప్రసంగంలో భుట్టో పేర్కొన్నారు.
Next Story