
భారత్ పై అమెరికా విధించిన సుంకాలు న్యాయమే: జెలెన్స్ స్కీ
రష్యా నుంచి ఇంధన వనరులు దిగుమతి చేసుకునేవారికి ట్రంపే కరెక్ట్ అంటున్న కీవ్ అధినేత
రష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న భారత్ తో సహ ఇతర దేశాలపై ట్రంప్ వేస్తున్న సుంకాలు సబబే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ అన్నారు. ఆయన సరైన మార్గంలోనే వెళ్తున్నారని అభిప్రాయపడ్డారు.ఇంధనమే పుతిన్ ఆయుధం..చైనాలోని తియాంజిన్ వేదికగా జరిగిన ఎస్సీఈఓ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ఆయనను విలేకరులు ప్రశ్నించారు.దీనికి కీవ్ అధినేత సమాధానమిస్తూ.. శక్తి వనరులు పుతిన్ ఆయుధం అని ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ముగించడానికి పుతిన్ పై అదనపు ఒత్తిడి తీసుకురావడానికి రష్యాతో అన్ని రకాల వాణిజ్యాలు నిలిపివేయాలన్నారు. అయితే తన వ్యాఖ్యలతో జెలెన్స్ స్కీ ఎక్కడ భారత్ పేరు నేరుగా తీసుకురాలేదు.‘‘రష్యాతో ఒప్పందాలు కొనసాగించే దేశాలపై సుంకాలు విధించాలనే ఆలోచన సరైనదని నేను భావిస్తున్నాను’’ అని ఉక్రెయిన్ లోని బాంబు దాడికి గురైన అమెరికా యాజమాన్యంలోని కర్మాగారంలో ఆదివారం ఏబీసీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్ స్కీ అన్నారు.రష్యా చమురు కొనుగోలు చేస్తున్నారనే నెపంతో 25 శాతం ప్రతీకార సుంకం ట్రంప్ విధించారు. దీనితో రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం డోలాయమానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీవ్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయి.భారత్ చమురు కొనుగోళ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని రష్యా, ఉక్రెయిన్ లో తన యుద్ధానికి నిధులు సమకూర్చుకుంటుందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే భారత్ ఈ వాదనను తోసిపుచ్చింది. ఈ సుంకాలు అన్యాయం అని పేర్కొంది. ప్రస్తుతం అమెరికా మన దేశ వస్తువులపై 50 శాతం సుంకాలు వసూలు చేస్తోంది.ఈయూ దేశాలు రష్యాతో అన్యాయం..రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేయాలనే యూరోప్ దేశాల నిర్ణయంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం సరైనది కాదని, అన్యాయం అంటూ రష్యా నుంచి అన్ని రకాల ఇంధన కొనుగోళ్లను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.‘‘పుతిన్ పై అదనపు ఒత్తిడి అవసరమని మనమందరం అర్థం చేసుకున్నాము. మనకు అమెరికా నుంచి ఒత్తిడి అవసరం. ట్రంప్ యూరోపియన్లకు సరైన వారని నేను భావిస్తున్నాను. అందరి భాగస్వామ్యానికి నేను కృతజ్ఞుడను.కానీ వారిలో కొందరూ ఇంకా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తునే ఉన్నారు. ఇది న్యాయమైనది కాదు. కాబట్టి రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేయాలి’’ అని ఆయన మీడియాతో అన్నారు. ‘‘హంతకుడిని ఆపడానికి ఇదే ఏకైక మార్గం. మీరు అతని ఆయుధాలను తీసివేయాలి. అంటే శక్తే వనరులే అతని ఆయుధం’’ అని జెలెన్స్ స్కీ అన్నారు.మాస్కో మీట్ ఆఫర్ తిరస్కరణ..ఉక్రెయిన్ అధ్యక్షుడు మాస్కోలో పుతిన్ కలవచ్చు అనే వార్తలను ఆయన ఎగతాళి చేశారు. కావాలంటే ఆయనే కీవ్ కు రావచ్చన్నారు. ‘‘నా దేశం ప్రతిరోజు క్షిపణుల దాడులకు గురవతున్న సమయంలో నేను మాస్కోకు వెళ్లను. ఆ ఉగ్రవాద రాజధానికి నేను వెళ్లను. ’’ అని జెలెన్స్ స్కీ చెప్పారు.‘‘నేను చెప్పినట్లుగానే ఆయన కీవ్ కు రావాలి. కాబట్టి ఆయన అలా చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. మేము నిర్ణయించిన సమావేశాన్ని వాయిదా వేయాలి’’ అని ఆయన అన్నారు. తాజాగా రష్యా, ఉక్రెయిన్ పై 800 కి పైగా డ్రోన్లు పదుల సంఖ్యలో క్షిపణులు ప్రయోగించింది. ఇందులో కనీసం 8 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించారు. 59 మంది గాయపడ్డారు. కీవ్ లో కీలక ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయి.