
రష్యా చమురు కొనుగోలుకు మినహాయింపు..
భారతదేశానికి పెద్ద ఊరటే అంటున్న నిపుణులు ..
పెరుగుతోన్న చమురు ధరలు, ఇరాన్‌పై అమెరికా యుద్ధం త్వరగా ముగిసే అవకాశాలు లేకపోవడంతో సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురును ఇతర దేశాలు కొనుగోలు చేయడానికి అమెరికా ప్రభుత్వం తాత్కాలిక అధికారాన్ని ప్రకటించింది.
ఉగ్రవాద ఇరాన్ పాలన వల్ల కలిగే ముప్పు, ఇంధన ధరలను స్థిరీకరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని US ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ గురువారం ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ స్వల్పకాలిక చర్య ఇప్పటికే రవాణాలో ఉన్న చమురుకు మాత్రమే వర్తిస్తుందని, రష్యా ప్రభుత్వానికి గణనీయమైన ఆర్థిక ప్రయోజనాన్ని అందించదని కూడా పేర్కొన్నారు.
అమెరికా 30 రోజుల మినహాయింపు భారతదేశానికి పెద్ద ఊరట అని నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఇంధన సరఫరా సులభతరం కావడంతో పాటు భారత్‌లో ఇంధన ధరలపై ఒత్తిడి తగ్గుతుందన్నారు.
Next Story

