
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
ఉక్రెయిన్ కు అమెరికా ఆయుధాల సరఫరా
నేడు ట్రంప్ ను కలవబోతున్న నాటో చీఫ్ మార్క్ రుట్టే
నాటో మిత్రదేశాలకు ఆయుధాలు, పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థలను విక్రయించే ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు వెల్లడించిన నేపథ్యంలో నాటో చీఫ్ మార్క్ రుట్టే, డొనాల్డ్ ట్రంప్ కు కలవబోతున్నారు. ఈ ఆయుధాలను నాటో దేశాలు అమెరికా దగ్గర కొనుగోలు చేసి ఉక్రెయిన్ కు వారం తరువాత అందిస్తారని సమాచారం.
మార్క్ రుట్టే సోమ, మంగళవారం వాషింగ్టన్ లోనే గడపనున్నారు. ఈ పర్యటనలో ఆయన అధ్యక్షుడు ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హేగ్సెత్ తో పాటు కాంగ్రెస్ సభ్యులతో చర్చలు జరుపుతారు.
‘‘రేపు నాటో చీఫ్ నేను సమావేశం కాబోతున్నాను’’ అని ట్రంప్ ఆదివారం రాత్రి విలేకరులతో చెప్పారు. ‘‘మేము వారికి చాలా ఆధునాతమైన ఆయుధాలు పంపబోతున్నాము. వారు దాని కోసం మాకు వందశాతం చెల్లిస్తారు’’ అని ట్రంప్ అన్నారు.
యుద్దం కీలక మలుపు తిరుగుతుంది
ట్రంప్ మిత్రుడు, దక్షిణ కరోలినాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఆదివారం మాట్లాడుతూ.. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ కు సహయం చేయడంలో ట్రంప్ ఆసక్తి చూపేడుతున్నారని, యుద్దం కీలక దశకు చేరుకుంటుందని అన్నారు.
తన ఎన్నికల ప్రచారంలో యుద్దాన్ని త్వరగా ముగించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని, అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధాగా ను కానివ్వనని హమీ ఇచ్చారని చెప్పారు.
‘‘రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ కు తమను తాము రక్షించడానికి రికార్డు స్థాయిలో ఆయుధాలు వెళ్లడం మీరు చూస్తారు’’ అని గ్రాహం ‘‘ఫేస్ ది నేషన్’’ తో అన్నారు.
‘‘రష్యన్ అధ్యక్షుడు పుతిన్ చేసిన అతిపెద్ద తప్పుడు అంచనాల్లో ఒకటి ట్రంప్ ను ఆడించడం. రాబోయే రోజులు, వారాల్లో పుతిన్ చర్చల పరిధిలోకి తీసుకురావడానికి భారీ ప్రయత్నం జరుగుతుందని మీరు చూడండి’’ అని గ్రాహం చెప్పారు.
రష్యాపై సోమవారం కీలక ప్రకటన ఉంటుందని కూడా ఆయన చెబతున్నారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ పై భారీ వైమానిక దాడులను ప్రారంభించింది. వీటిని ఎదుర్కోవడానికి కీవ్ చాలా కష్టపడుతోంది. ఆ తరువాత ఉక్రెయిన్ లో నాటో చీఫ్ పర్యటించారు.
రేపు ఏం జరగుతుందో చూద్దాం..
అమెరికా, రష్యాకు చెందిన 300 బిలియన్ డాలర్ల ను ఇప్పుడు వినియోగించుకోవాలని యోచిస్తోంది. కనెక్టికట్ కు చెందిన డెమోక్రాటిక్ కు చెందిన సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటల్ మాట్లాడారు.
ఉక్రెయిన్ కు సహాయం చేయడానికి యుద్ధ ప్రారంభంలో గ్రూప్ ఆఫ్ సెవన్ దేశాలు స్తంభింప చేసిన మూడువందల బిలియన్ రష్యన్ ఆస్తులను కొంత భాగం ఉపయోగించుకోవడం గురించి కాపిటల్ హిల్, యూరోపియన్ అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదురుతోందని అన్నారు. యూఎస్ వద్ద ఉన్న ఏడు బిలియన్ల రష్యన్ నిధులను సైతం ఉపయోగించవచ్చని బ్లూ మెంటల్ అన్నారు.
ఉక్రెయిన్ కావాలనుకున్న కొన్ని అమెరికా తయారీ ఆయుధాలు యూరప్ లోని నాటో మిత్రదేశాలలో ఉన్నాయని రూబియో శుక్రవారం అన్నారు. యూరోపియన్ దేశాలు అమెరికా నుంచి ప్రత్యామ్నాయాలను కొనుగోలు చేయడంలో ఆ ఆయుధాలను ఉక్రెయిన్ కు అందించాలని ఆయన అన్నారు.
ఫ్రెంచ్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్న్ మాట్లాడుతూ.. రాబోయే ప్యాకేజీలో వైమానిక రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి యూరోపియన్ అధికారులు ట్రంప్ పరిపాలనకు విజ్ఞప్తి చేస్తున్నారని అన్నారు. ఫ్రాన్స్ కు సామర్థ్యంలో లోపం ఉందని, ఉక్రెయిన్ కు కొత్త గ్రౌండ్ ఎయిర్ క్షిపణులను అందించడానికి వచ్చే ఏడాది వరకూ వేచి చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
భారత్, చైనా, బ్రెజిల్ ప్రభావితం అవ్వొచ్చు
రష్యా చమురు ఎగుమతులను నిర్వీర్యం చేయాలనే అమెరికా వాదనల వల్ల భారత్, బ్రెజిల్, చైనాలు ఇబ్బంది ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై సెనేట్ లో చట్టాన్ని ప్రవేశపెట్టడానికి రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
రష్యా ఎగుమతి చేసే చమురు, గ్యాస్, యురేనియం ఇతర ఎగుమతులను కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం సుంకాలను విధించాలని ఈ చట్టంలో ప్రతిపాదించబోతున్నారు. ఇది రష్యా నుంచి ఎక్కువగా ఇంధన అవసరాలు తీర్చుకుంటున్న బ్రెజిల్, భారత్, చైనా ఆర్థిక వ్యవస్థలపై అపారమైన ప్రభావం చూపుతుంది.
‘‘ఇక్కడ అతిపెద్ద అపరాధులు బ్రెజిల్, భారత్, చైనా’’ అని గ్రాహం అన్నారు. ఈ యుద్దాన్ని ముగించడమే నా లక్ష్యం. దీనికి ఉన్న ఏకైక మార్గం పుతిన్ కు మద్దతు ఇచ్చే వ్యక్తులను ఆకర్షించడం.
అమెరికన్ ఆర్థిక వ్యవస్థ లేదా పుతిన్ ఏదో ఒకటి ఎంచుకునేలా చేయడం’’ అని గ్రాహం అన్నారు. ఈ బిల్లుకు సెనెట్ లో మద్దతు ఉంది. కానీ రిపబ్లికన్ నాయకులు ట్రంప్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ చట్టం గురించి వైట్ హౌజ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంక్షలు, సుంకాలు లేదా ఇతర జరిమానాలు విధించడానికి కాంగ్రెస్ కు నియంత్రణ అప్పగించాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ప్రక్రియపై తనకు అధికారం ఉండాలని ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ బిల్లు ప్రకారం.. అధ్యక్షుడు కొన్ని పరిస్థితులలో జరిమానాలను రద్దు చేయవచ్చు. కానీ ఉల్లంఘనలు తిరిగి ప్రారంభమైతే వెంటనే వాటిని విధించవచ్చు.
అధ్యక్షుడు 180 రోజుల పాటు ఆంక్షలను మాఫీ చేయడానికి అనుమతి ఉంటుందని గ్రాహం చెబుతున్నారు. కొంతమంది డెమొక్రాటిక్ చట్ట సభ్యులు ఈ మినహాయింపుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వీటిని బ్లూ మెంటల్ తోసిపుచ్చుతున్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ బిల్లుపై స్పందిస్తూ.. ‘‘నిస్సందేహంగా ఇది శాంతిని తీసుకువస్తుంది.’’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Next Story