
ఊహాత్మక క్యారికేచర్
"నన్నేమైనా జోకర్ని అనుకుంటున్నారా, ఏంటీ?": ట్రంప్
ట్రంప్ తన The Art of the Dealలో చెప్పినట్టు.. చర్చల సమయంలో ప్రత్యర్థిని ఎప్పుడూ అయోమయంలో ఉంచాలన్నది వ్యూహంగా ఉంది
ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుందని ఒకవైపు ప్రచారం జరుగుతుంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. తనదైన శైలిలో "కన్ఫ్యూజన్ స్ట్రాటజీ"ని ప్రయోగిస్తూ.. ఇరాన్ తన ముందు మోకరిల్లిందని, పరిష్కారానికి తనే ఏకైక మార్గమని ఆయన చాటిచెబుతున్నారు.
ట్రంప్ తన పుస్తకం The Art of the Dealలో చెప్పినట్టు.. చర్చల సమయంలో ప్రత్యర్థిని ఎప్పుడూ అయోమయంలో ఉంచాలి. ఒకసారి "యుద్ధం" అంటారు, మరోసారి "ప్రేమగా ఒప్పందం" అంటారు. దీనివల్ల ఇరాన్‌కు అమెరికా తదుపరి అడుగు ఏంటో అర్థం కాక, ఒత్తిడిలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన ప్లాన్ కావచ్చు.
"వారు (ఇరాన్) నా కాళ్ల దగ్గర పడి ప్రాధేయపడుతున్నారు" అని చెప్పడం ద్వారా.. ఇరాన్ ప్రజల్లో తమ నాయకత్వంపై నమ్మకం పోగొట్టాలని చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, తుపాకీ గుండు కంటే "అహంకారాన్ని దెబ్బతీసే మాట" ఎక్కువ పనిచేస్తుందని ఆయన నమ్మకం.
అమెరికాలోని తన మద్దతుదారులకు తానొక "స్ట్రాంగ్ లీడర్" అనిపించుకోవడానికి ఇలాంటి ప్రగల్భాలు అవసరం. "నన్నే సుప్రీం లీడర్ అవ్వమన్నారు" వంటి మాటలు నెటిజన్లకు జోకుల్లా అనిపించినా, ఆయన వీరాభిమానులకు మాత్రం అది "ట్రంప్ పవర్"లా కనిపిస్తుంది.
ట్రంప్ ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటే అది వార్త అవ్వదు. కానీ, ఉదయం "బెదిరింపు", సాయంత్రం "ఆఫర్" ఇస్తే.. మీడియా మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. ఈ "అటెన్షన్ ఎకానమీ"లో ఆయన మాస్టర్!
తాజాగా ట్రంప్ ఇరాన్ సుప్రీంలీడర్ ను మజ్తాబాను ఉద్దేశించి.. లొంగిపొమ్మని ఎన్ని సార్లు చెప్పాలి, నన్ను ఏమైనా జోకర్ని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. తక్షణమే లొంగిపోవాలని ఆదేశించారు. అయితే ఇరాన్ వీటినేటిని పట్టించుకోకుండా యుద్ధం ఆగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
ట్రంప్ తన 'ట్రూత్' సోషల్ మీడియా వేదికగా విసురుతున్న "నవ్వుల తూటాలు" ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఆయన తాజా వాదనల సారాంశం ప్రకారం.. ఇరాన్ మిలిటరీని అమెరికా నాశనం చేసిందని, అందుకే ఆ దేశ నేతలు ఒప్పందం కోసం వేడుకుంటున్నారని ట్రంప్ ప్రకటించారు. "వారు తప్పు చేస్తున్నారు, మరీ ఆలస్యం కాకముందే సీరియస్‌గా ఉండటం మంచిది" అని హెచ్చరించారు.
సుప్రీం లీడర్ ఆఫర్
ఒక అడుగు ముందుకేసి.. ఇరాన్ నేతలు తనను ఆ దేశ తదుపరి "సుప్రీం లీడర్"గా ఉండమని అడిగారని, కానీ తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని వింత ప్రగల్భాలు పలికారు. ఇది ఆయన ఒత్తిడి తంత్రంలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
నాటోపై ఆగ్రహం: యుద్ధ సమయంలో తనకు సహకరించని నాటో దేశాలను "పేపర్ టైగర్స్"గా అభివర్ణిస్తూ.. "మీరు ఏమీ చేయలేదు, కానీ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోం" అంటూ తన అసహనాన్ని వెళ్లగక్కారు.
"యుద్ధం ఆగిపోవాలంటే నేనే దిక్కు.. ఇరాన్ ప్రజల ప్రాణాలు నా చేతుల్లోనే ఉన్నాయి. ఆలస్యమైతే వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు!" - డొనాల్డ్ ట్రంప్ స్ట్రాటజీ
'జోకర్' అంటూ నెటిజన్ల కౌంటర్లు..
ట్రంప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి చర్చలే లేవంటుంటే, ట్రంప్ మాత్రం ఒప్పందం అయిపోయిందంటున్నారు. దీంతో నెటిజన్లు ఆయన్ని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు:
యూ-టర్న్ పాలిటిక్స్: పొద్దున యుద్ధం అంటారు, సాయంత్రం సుప్రీం లీడర్ అంటారు.. ఆయనేమైనా 'జోకర్' అనుకుంటున్నారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
అతిశయోక్తికి పరాకాష్ట: సుప్రీం లీడర్ పదవి ఆఫర్ చేశారనడం ట్రంప్ మార్క్ కామెడీ అని, ఇది కేవలం తన సొంత ఓటర్లను ఆకట్టుకోవడానికేనని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
క్షేత్రస్థాయిలో అసలు నిజాలేమిటి?
ఇరాన్ పరిస్థితి కూడా ఇప్పుడు "ముందు నుయ్యి.. వెనుక గొయ్యి" అన్నట్లుగా ఉంది.
మొజ్తాబా మిస్టరీ: సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ బాధ్యతలు తీసుకున్నా, ఆయన ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
గౌరవప్రదమైన నిష్క్రమణ: ఇరాన్ లోపల లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నా, ప్రజల నుండి తిరుగుబాటు వస్తుందనే భయంతో బయటకు మాత్రం "పరిశీలిస్తున్నాం" అనే నాటకం ఆడుతున్నట్లు సమాచారం.
మొత్తానికి ట్రంప్ తన మాటలతో ఇరాన్‌ను గందరగోళంలోకి నెట్టేయడంలో సక్సెస్ అయ్యారు. ఆయన ప్రగల్భాలు నిజమా లేక కేవలం డ్రామానా అన్నది పక్కన పెడితే.. ఈ పొలిటికల్ చెస్ గేమ్‌లో "నేనే దిక్కు" అని ఆయన మూర్ఖంగా నమ్మడమే ఇప్పుడు ప్రపంచానికి శాంతిని ఇస్తుందో లేక యుద్ధాన్ని తీవ్రం చేస్తుందో చూడాలి.
Next Story

