
యుద్ధం 28వ రోజుకు చేరింది. శాంతిచర్చలు ఇంకా మొదలు కాలేదు..
"ట్రంప్ లెక్క తప్పింది.. ఇరాన్ తెగించింది!"
ఇరాన్ విషయంలో 'ఆర్ట్ ఆఫ్ ది డీల్' పారుతున్నట్లు కనిపించడం లేదు. ఏప్రిల్ 6 వరకు దాడులు చేయబోమని అమెరికా ప్రకటన
ఇరాన్-అమెరికా యుద్ధం శుక్రవారం నాటికి 28వ రోజుకు చేరింది. వేలాది మంది నేలకొరుగుతున్నారు. తాజాగా ఇరాన్ మరో ముఖ్య అధికారిని కూడా చింపేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోపక్క, యుద్ధ విరమణ సూచనలు కనిపించడం లేదు. ట్రంప్ పెట్టిన షరతులను ఇరాన్ నిర్ద్వంధంగా తోసిపుచ్చింది. దీంతో తల పట్టుకున్న ట్రంప్ తన 5 రోజుల కాల్పుల ఏకపక్ష కాల్పుల విరమణ, ఇరాన్ క్షేత్రాలపై దాడులను ఏప్రిల్ 6 వరకు పొడిగించారు.
ఇరాన్ మాత్రం యుద్ధాన్ని విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. యుద్ధాన్ని ముగించేది తామేనని స్పష్టం చేసింది.
పారని అమెరికా పాచిక...
ఇరాన్ విషయంలో 'ఆర్ట్ ఆఫ్ ది డీల్' పారుతున్నట్లు కనిపించడం లేదు. ఇస్లామిక్ రిపబ్లిక్ యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉందనే కథనాన్ని నమ్మించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తహతహలాడుతున్నారు.
కానీ, దాదాపు నాలుగు వారాల కిందట చర్చలను కాదని ట్రంపే స్వయంగా రాజేసిన ఈ యుద్ధ కుంపటి నుంచి వెనక్కి తగ్గడానికి టెహ్రాన్ సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటివరకు ఎటువంటి బహిరంగ సంకేతాలు లేవు.
ట్రంప్ ఏమన్నారంటే..
“వారు (ఇరాన్) ఒప్పందం చేసుకోవాలని ఎంతగానో తపిస్తున్నారు, కానీ తమ స్వంత ప్రజలే తమను చంపేస్తారనే భయంతో వారు అలా చెప్పడానికి భయపడుతున్నారు,” అని బుధవారం సాయంత్రం కాంగ్రెస్ సభ్యులతో అన్నారు. “వారు మా చేతిలో (అమెరికా) హతమవుతారని కూడా భయపడుతున్నారు,” అని ఈ ఘర్షణపై తన తాజా అయోమయ వ్యాఖ్యలో పేర్కొన్నారు.
ట్రంప్ (ఫోటో కర్టసీ సీఎన్ఎన్)
ఈ పొంతన లేని వ్యాఖ్యలు, ఈ వారంలోనే ఏదో ఒక పురోగతి ఉండవచ్చన్న ట్రంప్ వాదనలపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు, వేలాది మంది అమెరికన్ సైనికులు ఇరాన్ వైపు చేరుకుంటుండటంతో యుద్ధం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. వారిని రంగంలోకి దించాలనే ఏ నిర్ణయమైనా ట్రంప్‌కు పెద్ద రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఇది అమెరికా సైనికుల భారీ ప్రాణనష్టానికి దారితీయవచ్చు. ఇరాన్ ఇప్పటికే స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్ మూసివేయడం వల్ల కలిగిన ఆర్థిక నష్టాల కంటే ఇది చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. యుద్ధాలను ఆపడమే తన లక్ష్యమని అధికారంలోకి వచ్చిన ట్రంప్‌కు, ఈ సుదీర్ఘ యుద్ధం ఆయన రెండో విడత పదవీకాలాన్ని, ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉంది.
అందువల్ల చర్చల అవసరం ఇప్పుడు చాలా కీలకంగా మారింది. కానీ ఇప్పటివరకు, తాను మొదలుపెట్టిన యుద్ధాన్ని ముగించాలన్న ట్రంప్ ఆరాటానికి ఇరాన్ స్పందించడం లేదు. ఇది ట్రంప్ ను అయోమయానికి గురిచేస్తోంది.
“ఇరాన్ సంప్రదింపుల ప్రతినిధులు చాలా విభిన్నంగా, ‘వింతగా’ ఉన్నారు. ఒప్పందం కోసం వారు మమ్మల్ని ‘బతిమాలుతున్నారు’. సైనికపరంగా వారు సర్వనాశనం అయ్యారు కాబట్టి వారు అలాగే చేయాలి, కానీ బహిరంగంగా మాత్రం వారు కేవలం ‘మా ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం’ అని చెబుతున్నారు. తప్పు!!!” అని ట్రంప్ గురువారం ట్రూత్ సోషల్ వేదికగా రాశారు.
శాంతి చర్చలు ఆలస్యం అయ్యాయా?
యుద్ధాన్ని దౌత్యంతో ముగించాలన్న ఆయన ఆరాటంలో ఒక లోగుట్టు ఉంది. మూడు వారాలకు పైగా సాగుతున్న ఈ పోరాటంలో, రాజీ పడటానికి ఇప్పుడు చాలా ఆలస్యమైందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
వాస్తవాలను తారుమారు చేయడంలో ట్రంప్ ఎప్పుడూ ముందుంటారనేది అమెరికా ప్రజల మనసులో మాట. కానీ, తన ప్రతిష్టను కాపాడుకుంటూ, ఇరాన్‌కు లొంగిపోకుండా ఈ సమస్య నుండి బయటపడాలంటే ఆయనకు బలమైన అంశాలు అవసరం. ప్రస్తుత సంక్షోభం అధ్యక్షుడి జీవిత తత్వానికి భిన్నమైంది. శత్రువును పూర్తిగా లొంగదీసుకోవాలని పట్టుబట్టకుండా, వారికి గౌరవప్రదంగా తప్పుకునే మార్గాన్ని చూపడం. కానీ శత్రువు అంతకన్నా మొండిగా ఉండడమే ట్రంప్ కి మింగుడుపడడం లేదు.
ట్రంప్ పై పెరుగుతున్న వత్తిడి..
ట్రంప్ కి ఎక్కువ సమయం లేదు. యుద్ధం వల్ల రాజకీయ, ఆర్థిక, భౌగోళిక వత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. వియత్నాం నుండి ఇరాక్ వరకు అమెరికా చేసిన యుద్ధాలన్నీ తప్పుదోవ పట్టించినవే కావడంతో అదే చిక్కుముడిని ఈయన కూడా అదే బాటలో పయనిస్తున్నారా అనే అనుమానం వస్తోంది. యుద్ధం నుంచి బయటపడటానికి దాన్ని మరింత తీవ్రతరం చేయాలా వద్దా? అని కొట్టుమిట్టాడుతున్నారు.
ఇరాన్ తన నాయకత్వాన్ని, సైనిక పారిశ్రామిక రంగాన్ని చాలా వరకు కోల్పోయింది. అమెరికా సైనిక విధ్వంసక సామర్థ్యం ఎంత ఉన్నప్పటికీ, అమెరికా అధ్యక్షుడిని మరింత రక్తపాతంతో కూడిన పోరాటంలోకి లాగడానికి ఇరాన్ మొగ్గు చూపవచ్చు.
ట్రంప్ స్వయంకృత యుద్ధం...
ఈ వారంలో యుద్ధం పట్ల ట్రంప్ నిలకడలేని వైఖరి—ఇరాన్ విద్యుత్ ప్లాంట్‌లను ధ్వంసం చేస్తామని తీవ్రమైన బెదిరింపులు చేయడం, మరుసటి క్షణమే వెనక్కి తగ్గి చర్చలకు సిద్ధమని చెప్పడం—ఆయన విలక్షణ రాజకీయ శైలిని ప్రతిబింబిస్తుంది. శాంతి ఒప్పందానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయనే చేదు నిజాన్ని కూడా ఇది చూపిస్తోంది.
మాజీ అమెరికా దౌత్యవేత్త ఆరోన్ డేవిడ్ మిల్లర్ మాట్లాడుతూ, “ట్రంప్ చెల్లించలేని మూల్యాన్ని ఇరాన్ డిమాండ్ చేయబోతోంది, దీనివల్ల జలసంధిని కేవలం తెరవడమే కాకుండా, దాన్ని తెరిచి ఉంచేలా చూడటానికి ఆయన ఒక పెద్ద ఆపరేషన్‌ను చేపట్టక తప్పదు.”
ప్రస్తుతం ఈ యుద్ధం అంతర్జాతీయ సంక్షోభంగా మారిందని మిల్లర్ సిఎన్ఎన్ ఇంటర్నేషనల్‌తో పేర్కొన్నారు. “ట్రంప్ ఎంచుకున్న ఈ యుద్ధం ఇప్పుడు అనివార్య యుద్ధంగా మారింది.”
ప్రస్తుత ప్రభుత్వం నుండి చర్చల నైపుణ్యాన్ని ఆశించడం కష్టమే. ఈ యుద్ధానికి సరైన కారణాన్ని గానీ, బయటపడే మార్గాన్ని గానీ వారు ఎప్పుడూ స్పష్టంగా గుర్తించలేదు. ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఉక్రెయిన్, గాజాలో వారి ఇతర ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు.
ఇరాన్ బెట్టు ఎందుకు?
ఇప్పుడు ఇరాన్ తో శాంతి చర్చలు జరిగితే, బహుశా పాకిస్థాన్ లేదా టర్కీ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గతంలో ఆయన జోక్యాన్ని ట్రంప్ పెద్దగా ఇష్టపడలేదు. ఇప్పుడు మొగ్గు చూపడం ఇరాన్‌కు ఆకర్షణీయంగా ఉండవచ్చు, కానీ ఇది ఆయనను రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు.
యుద్ధం గురించి దేశాన్ని సిద్ధం చేయకుండా, ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్రంప్, ఇరాన్ కంటే ఎక్కువగా చర్చల కోసం ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది.
దాడులను, హత్యలను పూర్తిగా నిలిపివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. యుద్ధం మళ్ళీ జరగకుండా హామీ ఇవ్వాలని, నష్టపరిహారం చెల్లించాలని కోరుతోంది. అలాగే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా, స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్ పై పూర్తి సార్వభౌమాధికారం తమకే ఉండాలని కోరుతోంది. ఇది ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవడమే అవుతుంది, దీనిని ట్రంప్ ఎప్పటికీ అంగీకరించలేరు.
పట్టుకోల్పోతున్న ట్రంప్...
అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రణాళికలో ఇరాన్ అణు ఆయుధాలను కలిగి ఉండకూడదని, యురేనియం నిల్వలను అప్పగించాలని, ప్రాంతీయ గ్రూపులకు మద్దతు నిలిపివేయాలని, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ను తెరవాలని ఉన్నాయి. యుద్ధం మొదలైనప్పుడు స్వేచ్ఛగా ఉన్న ఈ జలసంధిని ఇప్పుడు చర్చల్లో ఒక ప్రధాన డిమాండ్‌గా చేర్చాల్సి రావడమే ట్రంప్ పట్టుకోల్పోయారనడానికి నిదర్శనం.
మీడియాతో మాట్లాడుతున్న ట్రంప్ (ఫోటో కర్టసీ CNN)
తమ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడానికి ఇరాన్ గతంలో ఒబామాతో ఒప్పందం చేసుకుంది. కానీ దానికి ప్రతిఫలంగా ఆంక్షల నుండి భారీ ఉపశమనం వారు కోరుకుంటున్నారు.
కేవలం చర్చల వివరాలే కాకుండా, ఒక ప్రాథమిక విభేదం కూడా ఉంది. తాము గెలుస్తున్నామని ఇరుపక్షాలూ భావిస్తున్నాయి. ఇరాన్ సైనికపరంగా ఓడిపోయిందని లీవిట్ పేర్కొన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ సైన్యం, నాయకత్వం తీవ్రంగా దెబ్బతిన్న మాట వాస్తవమే. కానీ శత్రువు ఈ యుద్ధాన్ని ఎలా చూస్తున్నారో అర్థం చేసుకోవడంలో ట్రంప్ విఫలమవుతున్నారు. ఇరాన్ పాలకులకు, ఏదో రకంగా మనుగడ సాగించడమే విజయం. వారు నేరుగా అమెరికాతో యుద్ధం గెలవలేకపోవచ్చు, కానీ అమెరికా వెనక్కి తగ్గేంత నొప్పిని కలిగించాలని వారు ప్రయత్నిస్తున్నారు.
అమెరికా ఇప్పటికే గెలిచినట్లయితే, ఇంకా ఎందుకు పోరాడుతోంది? వేలాది మంది సైనికులను మిడిల్ ఈస్ట్‌కు ఎందుకు పంపుతోంది? అన్న ప్రశ్నలకు ట్రంప్ నుంచి సమాధానం లేకపోవడమే ఆయన వైఫల్యానికి నిదర్శనమా?
Next Story

