
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
చైనా, భారత్ పై ట్రంప్ మరోసారి విమర్శలు
ఉక్రెయిన్ పై యుద్ధానికిి ఈ రెండు దేశాలే నిధులు సమకూరుస్తున్నాయని ఆరోపణలు
ఉక్రెయిన్ యుద్ధానికి భారత్- చైనా ప్రాథమిక పెట్టుబడిదారులుగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ జనరల్ అసెంబ్లీ లో ఆరోపించారు. రష్యా నుంచి తక్కువ ధరకు వచ్చే ముడిచమురును కొనుగోలు చేస్తూ యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయని విమర్శించారు.
‘‘చైనా, భారత్ లు రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో క్రిమ్లిన్ కు నిధులు సరఫరా చేస్తున్నారు. ’’ అని ట్రంప్ గంటకు పైగా చేసిన తన ప్రసంగంలో ఆరోపించారు. తన ప్రసంగంలో ట్రంప్ మాట్లాడుతూ ‘‘క్షమించరాని విషయం ఏంటంటే.. నాటో దేశాలు కూడా రష్యన్ ముడి చమురును, రష్యన్ ఇంధన్ ఉత్పత్తులను పెద్దగా తగ్గించలేదు’’ అని ఆయన చెప్పారు. ఇది తెలుసుకున్న తరువాత నేను సంతోషంగా లేనని ఆయన అన్నారు.
‘‘ఒక్కసారి ఆలోచించండి. వారు తమపైనే యుద్దానికి నిధులు సమకూరుస్తున్నారు. దాని గురించి ఎవరూ విన్నారు? యుద్ధాన్ని ముగించడానికి రష్యాతో ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా లేనట్లయితే అమెరికా చాలా బలమైన శక్తివంతమైన సుంకాలను విధించడానికి సిద్ధంగా ఉంది. ఇది రక్తపాతాన్ని చాలా త్వరగా ఆపుతుందని నేను నమ్ముతున్నాను’’ అని ట్రంప్ అన్నారు.
సుంకాల ప్రభావం శక్తివంతంగా ఉండాలంటే యూరోపియన్ దేశాలు కచ్చితమైన చర్యలు తీసుకోవడానికి మాతో చేరాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ‘‘నా ఉద్దేశ్యం ప్రకారం.. మీరు అన్నింటికి చాలా దగ్గరగా ఉన్నారు. మన మధ్య ఒక సముద్రం ఉంది. యూరప్ మాతో కలిసి నడవాలి. రష్యాతో పోరాడుతున్నప్పుడూ మళ్లీ అక్కడి నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నారు’’ అని అన్నారు.
‘‘ఇది వారికి ఇబ్బందికరంగా ఉంది. నేను దాని గురించి తెలుసుకున్నప్పుడూ వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను మీకు చెప్పగలను. కానీ వారు రష్యా నుంచి అన్ని ఇంధన కొనుగోళ్లను వెంటనే నిలిపివేయాలి.
లేకుంటే.. మనమందరం చాలా సమయం వృథా చేస్తున్నాము. కాబట్టి నేను దీని గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ సమావేశమైన యూరోపియన్ దేశాలతో మనం ఈ రోజు దీని గురించి చర్చించబోతున్నాము’’ కచ్చితంగా నేను దాని గురించి మాట్లాడటం వినడానికి వారు సంతోషిస్తారు. కానీ అది అలాగే ఉంది. నా మనసులోని మాటను మాట్లాడటం నిజం మాట్లాడటం నాకు ఇష్టం’’ అని ఆయన అన్నారు.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై 25 శాతం టారిఫ్ లను అమెరికా విధించింది. అలాగే అన్ని దేశాలపై సుంకాలు విధించినట్లుగానే భారత్ పై 25 శాతం సుంకాలు విధించింది. దీనితో న్యూఢిల్లీపై 50 శాతం సుంకాలను అమెరికా వసూలు చేస్తోంది. ఇది ప్రపంచంలోనే ఏ దేశంపైనా అమెరికా వసూలు చేస్తున్న అత్యధిక సుంకాలు.
భారత్ పై అమెరికా విధిస్తున్న సుంకాలను న్యూఢిల్లీ గర్హించింది. తమ దేశం ఆర్థిక స్థిరత్వానికి ఎక్కడ నుంచి ముడిచమురు కొనుగోలు చేయాలో పూర్తిగా తమ ఇష్టప్రకారం జరుగుతుందని సమాధానం ఇచ్చింది. యూఎస్ పూర్తిగా అన్యాయంగా వ్యవహరిస్తోందని తన అసంతృప్తి వ్యక్తం చేసింది.
Next Story