అగ్రరాజ్యంతో కుదిరిన వాణిజ్య ఒప్పందం
x

అగ్రరాజ్యంతో కుదిరిన వాణిజ్య ఒప్పందం

ప్రకటించిన ట్రంప్- మోదీ, ఇక నుంచి మేడ్ ఇన్ ఇండియా వస్తువులపై 18 శాతం సుంకాలు


భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరుదేశాల అధినేతలు సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. ప్రస్తుతం భారత్ పై విధిస్తున్న 25 శాతం సుంకాలు, మరో 25 శాతం జరిమానా తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేస్తున్నట్లు భారత్ హమీ ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు.

ఇక నుంచి భారతీయ వస్తువులపై కేవలం 18 శాతం సుంకాలు మాత్రమే అమలవుతాయని వైట్ హౌజ్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ సుదీర్ఘంగా సంభాషణలు జరిపినట్లు తెలిసింది.

‘‘భారత్ లో తయారైన వస్తువులపై ఇక నుంచి 18 శాతం సుంకం మాత్రమే ఉంటుంది’’ అని ప్రకటించడం తనకు సంతోషంగా ఉందని ప్రధాని మోదీ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ‘‘నా ప్రియమైన స్నేహితుడు అధ్యక్షుడు ట్రంప్ తో ఈ రోజు మాట్లాడటం చాలా బాగుంది.
మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై ఇప్పుడు 18 శాతం సుంకం ఉందని తెలిసి సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రకటన చేసినందుకు 1.4 బిలియన్ల భారతీయులు తరఫున ట్రంప్ కు హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని మోదీ అన్నారు.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేసినప్పుడూ, అది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
పరస్పర ప్రయోజనకరమైన సహకారానికి అవసరమైన అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని మోదీ అన్నారు. ప్రపంచం శాంతి కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు చాలా బాగున్నాయని, భారత్ అందుకు బాసటగా నిలుస్తుందని కూడా ప్రధాని ఎక్స్ లో ట్వీట్ చేశారు. భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రకటన రావడంతో స్టాక్ మార్కెట్లు ఫుంజుకున్నాయి. సెన్సెక్స్ ఐదు శాతానికి పైగా పెరిగింది.
Read More
Next Story