మరోసారి తుంటరి పనిచేసిన అమెరికా అధ్యక్షుడు
x
డొనాల్డ్ ట్రంప్

మరోసారి తుంటరి పనిచేసిన అమెరికా అధ్యక్షుడు

క్యాథలిక్ ల మత గురువు ధరించే దుస్తులతో ఏఐ ఫోటో ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తుంటరి పని చేశాడు. క్యాథలిక్ ల అత్యున్నత మత గురువు ధరించే పాపల్ దుస్తులలో ఉన్న తన ఏఐ ఇమేజ్ ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అయితే ఈ ఫొటో పై క్యాథలిక్ లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

చాలామంది సోషల్ మీడియా వినియోదారులు దీనిని భయంకరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి అంటూ ట్రంప్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. క్రైస్తవ మతానికి ఇది అవమానకరంగా భావిస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ మరణాన్ని ట్రంప్ అపహాస్యం చేశాడని పలువురు ఆరోపించారు.
‘‘ఇది చర్చికి, దేవుడిని అగౌరవం, అతను(ట్రంప్) అక్షరాల క్రీస్తు విరోధి’’ అని ఒక వ్యక్తి వ్యాఖ్యానించాడు. ‘‘ఇది పూర్తిగా అసహ్యకరమైనది, పూర్తిగా అభ్యంతరకరమైనది’’ అని మరొక వ్యక్తి రాశారు.
‘‘ఇది చాలా అగౌరవం, స్వీయ అవగాహానతో కూడుకున్నది. రిపబ్లికన్లు నిజంగా దానికి ఓటు వేశారు’’ అని మరో నెటిజన్ రాసుకొచ్చారు. ‘‘క్యాథలిక్ లంటే అతనికి ఎంత అగౌరవం, ట్రంప్, అతని మాగ్గోట్లు అగౌరవం, నీచత్వం, మూర్ఖత్వం గురించి మాట్లాడుతున్నారు. కొత్త పోప్ ను ఎంచుకోవడానికి మేము క్యాథలిక్ లు చేసే ప్రక్రియను ఎగతాళి చేయడానికి ఎంత ధైర్యం చేస్తున్నారు.’’ అని మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను పోప్ అవ్వాలనుకుంటున్నాను..
అయితే కొందరు నెటిజన్లు ఈ చిత్రంపై వ్యంగ్య కామెంట్లు పెడుతున్నారు. ఏప్రిల్ 22న పోప్ ఫ్రాన్సిస్ మరణించిన సమయంలో ఆయన అంత్యక్రియలకు ట్రంప్ హజరయ్యారు.
ఈ సందర్భంగా ట్రంప్ ను ‘‘మీరు ఎవరిని పోప్ గా చూడాలనుకుంటున్నారు’’ అని ఓ విలేకరి ప్రశ్నించారు.దీనికి ఆయన సమాధానమిస్తూ ‘‘నేను అవ్వాలనుకుంటున్నాను. ఇదే నా నెంబర్ వన్ ఛాయిస్’’ అన్నారు. పోప్ ను ఎన్నుకునే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఆ పదవి ఖాళీగా ఉంది. కొత్త పోప్ ఎన్నికకు కనీసం ఇరవై రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది.


Read More
Next Story