
మహ్మద్ బిన్ సల్మాన్ తో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్
పాకిస్తాన్ తో సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం
ఏ దేశం పై దాడి జరిగినా రెండు దేశాలపై జరిగినట్లే అని క్లాజు, స్పందించిన భారత్
పాకిస్తాన్ - సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరిన అంశంపై భారత్ స్పందించింది. ఒప్పందంలోని అంశాలను అధ్యయం చేస్తామని పేర్కొంది. ఈ ఒప్పందంలోని అంశాలపై ప్రకారం .. రెండు దేశాలలో ఏ దేశం పై దాడి జరిగిన రెండింటిపై దాడి జరిగినట్లు భావించాలని అవి సంతకం చేశాయి.
పాకిస్తాన్- సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం సెప్టెంబర్ 17న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రియాద్ పర్యటన సందర్భంగా సంతకాలు జరిగాయి. అక్కడ ఆయనకు క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మొహ్మద్ బిన్ సల్మాన్ అల్ యాహ్యా ప్యాలెస్ లో స్వాగతించారని నివేదికలు తెలిపాయి.
ప్రతిస్పందన..
డాన్ వార్తాపత్రిక ప్రకారం.. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన ఒప్పందంపై సంతకం చేసినట్లు ప్రకటించింది. ఇది రెండు దేశాలపై ఏదైనా దురాక్రమణను రెండు దేశాలపై జరిగే దురాక్రమణ చర్యగా పరిగణిస్తారని పేర్కొంది.
‘‘దాదాపు ఎనిమిది దశాబ్ధాలుగా కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవడం, సోదరభావం, ఇస్లామిక్ సంఘీభావం, ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాల బంధాలపై ఆధారపడి, రెండు వైపులా వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి’’ అని ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొంది.
ద్వైపాక్షిక భద్రతా సంబంధాలను పెంపొందించడానికి, ప్రాంతీయ ప్రపంచ శాంతికి దోహదపడటానికి ఈ ఒప్పందం ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుందని రెండు దేశాలు పేర్కొన్నాయి.
‘‘రక్షణ సహకారాన్ని మరింత అభివృద్ది చేయడం, ఏదైనా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉమ్మడి నిరోధాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం’’ అని జియో న్యూస్ నివేదించింది.
దోహాలో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడి హమాస్ సీనియర్ నాయకులు మరణించారు. ఈ తరువాత ఇస్లామిక్ దేశాల నాయకులు ఒక్క వేదికపైకి వచ్చారు. ఈ సంవత్సరం ప్రారంభంలో పాకిస్తాన్, భారత్ మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఈ తరువాత వ్యూహాత్మక రక్షణ ఒప్పందం పై సంతకం చేశారు.
భారత్ ప్రతిస్పందన..
పాకిస్తాన్- సౌదీ అరేబియా మధ్య ఒప్పందం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానం ఇచ్చారు. ‘‘సౌదీ, పాక్ మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరినట్లు మాకు తెలిసింది.
రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక ఒప్పందాన్ని అధికారికం చేసే పరిణామాలు జరుగుతున్నట్లు ప్రభుత్వానికి తెలుసు’’ అని ఆయన అన్నారు.
చారిత్రక సంబంధం
ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వెంట విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్థిక మంత్రి మహ్మద్ ఔరంగ జేబ్, సమాచారమంత్రి అత్తౌల్లా తరార, పర్యావరణ మంత్రి ముసాదిక్ మాలిక్, ప్రత్యేక సహాయకుడు తారిఖ్ ఫతేమీ ఉన్నారు.
పాకిస్తాన్- సౌదీ అరేబియా మధ్య ఉమ్మడి విశ్వాసం, విలువలు, పరస్పర విశ్వాసంతో పాతుకుపోయిన చారిత్రాత్మక సంబంధం ఉంది. ఈ పర్యటన రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం సహాకారానికి కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఈ ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని ఏకీకృతం చేయడానికి ఇద్దరు నాయకులకు ఒక ముఖ్యమైన అవకాశం అందిస్తుందని పాక్ ప్రధాని సౌదీ పర్యటనకు ముందు చెప్పారని విదేశాంగ కార్యాలయం తెలిపింది.
మూడోసారి..
వారం రోజుల గడువులోపల పాక్ ప్రధాని షరీఫ్ గల్ఫ్ కు వెళ్లడం ఇది మూడోసారి. గల్ఫ్ లో హమాస్ నాయకత్వంపై ఇజ్రాయెల్ దాడి తరువాత దోహాకు సంఘీభావం ప్రకటించడానికి, అంశంపై అరబ్- ఇస్లామిక్ దేశాల అత్యవసరం సమావేశంలో పాల్గొనడానికి ఆయన గతంలో రెండుసార్లు ఖతార్ ను సందర్శించారు.
Next Story